Representative image. (Photo Credits: Unsplash)

భర్త అన్నం తినడం లేదని అలిగి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.11లోని గౌరీశంకర్‌ కాలనీలో నివసించే కె.సంగీత (23) వివాహం 2019లో కె.సంజీవతో జరిగింది. డ్రైవర్‌గా పనిచేస్తున్న సంజీవ గత మూడు రోజుల నుంచి ఇంట్లో తినకపోవడంతో సంగీత ప్రశ్నించింది. ప్రతిరోజూ వంట చేస్తున్నానని, తినకపోవడంతో అవి పాడైపోతున్నాయని వెల్లడించింది.

హైదరాబాద్ లో ఘోరం.. మతిస్థిమితం కోల్పోయి.. మర్మాంగం కోసుకుని గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థి ఆత్మహత్య

దీనికి తోడు ఆమెకు కొంత కాలంగా అనారోగ్యం కూడా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి సంజయ్‌ రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.