Representational Image | (Photo Credits: PTI)

Hyderabad, March 26: తెలంగాణలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకటి ,రెండు వారాల వ్యవధిలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య శుక్రవారం 5 వందల మార్కును క్రాస్ చేసింది. మరోవైపు రికవరీల సంఖ్యలో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండటం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఆక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్స్ పేరుతో వైరస్ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం  ఏర్పాటు చేస్తుంది.

రాష్ట్రంలో కోవిడ్ కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 57,548 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 518 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 894 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,05,309కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 157 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 44 కేసులు, రంగారెడ్డి నుంచి 38 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 3 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,683కు పెరిగింది.

అలాగే గురువారం సాయంత్రం వరకు మరో 204 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,99,631 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,995 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 11 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.