Medak, Feb 23: మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇప్ప శంకర్ అనే యువకుడి కుటుంబాన్ని కులపెద్దలు కుల బహిష్కరణ చేయడంతో ఆ యువకుడు ఆత్మహత్య (Medak Young Man Commits Suicide) చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అన్యాయంగా కుల పెద్దలు కుల బహిష్కరణ చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మనస్తాపం చెందిన యువకుడు తన ఆవేదనను వీడియోలో రికార్డు (Selfie Video Before Death) చేశాడు.
గ్రామానికి చెందిన ముగ్గురు కుల పెద్దలపై జనవరి 6న అల్లదుర్గం పోలీస్ స్టేషన్‌లో శంకర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఇప్ప శంకర్... నిన్న అర్ధరాత్రి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన ఆవేదనను వెల్లడిస్తూ ఇప్ప శంకర్ వీడియో రికార్డ్ (Taking Selfie Video) చేశాడు.
కాగా .. చేయని హత్యకు శంకర్ గతంలో జైలు కెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు ఇప్ప శంకర్‌ను నిర్దోషిగా తేల్చింది. కుల పెద్దలు కులం నుండి వెలి వేశారు. ఈ లోపే అతడికి పెళ్లి జరిగింది . దీంతో భార్య కూడా అతడ్ని విడిచిపెట్టి వెళ్ళింది. నాలుగేళ్లు పోలీసులు, కోర్టులు చుట్టి తిరిగి విసిగిపోయిన ఇప్ప శంకర్ చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డ్ చేశాడు. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో తెలిపాడు. సమాజంలో మంచి వాళ్లకు న్యాయం జరగదని ఆవేనద వ్యక్తం చేశాడు. తన అన్నను ఇబ్బంది పెట్ట వద్దని కోరాడు. ఎంత మొరపెట్టుకొని భార్య కూడా తనను అర్థం చేసుకోలేదని వాపోయాడు. ఇక ఈ జీవితం ఎందుకు అంటూ.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు.