Case Filed Against Jogini Shyamala: జోగిని శ్యామల మీద జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు, మద్యం తాగుతూ తన బట్టలు విప్పి వీడియో తీశారని పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి, కేసును పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయింపు
Case Filed Against Jogini Shyamala (Photo-Video Grab)

Hyderabad, Mar 16: బోనాల పండుగలో తన ఆటపాటలతో, అందచందాలతో అందరిని ఆకట్టుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచతమైన జోగిని శ్యామల తాజాగా వివాదంలో చిక్కుకుంది. జోగిని శ్యామలతోపాటు మరో 15 మందిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు (zero fir registered Against Jogini Shyamala) నమోదయ్యింది. అనంతరం సదరు కేసును మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దైవ దర్శనానికి వెళ్లిన తనపై దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని శ్యామలతో పాటు మరో 15 మందిపై ఓ మహిళ ఫిర్యాదు (Case Filed Against Jogini Shyamala) చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాందీనగర్‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్‌పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను కలిసింది. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ అక్కడకు వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు మరో 15 మంది యువకులు, హెల్పర్‌ ఉమ ఉంది.

కాంగ్రెస్‌కు గుడ్ బై, సంచలన నిర్ణయం తీసుకున్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం, బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు

ఈ క్రమంలో వారు మద్యం తాగుతుండగా యువతిని కూడా మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. తాను దానికి ఒప్పుకోలేదని, దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా బాధిత మహిళను, ఆమె తల్లిపై దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచారని పేర్కొంది.

తన భర్తని ఉద్దేశించి నీ భర్త పెంపుడు కుక్క అంటూ దూషించారని వాపోయింది. ఇదేమిటని నిలదీయడంతో ఆగ్రహానికి గురైన శ్యామల మరికొంత మంది కలిసి తనపై దాడి చేయడమే కాక, తనను వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

బాధితురాలు డ్రైవర్‌ సాయంతో అక్కడ నుంచి తప్పించుకుని 13వ తేదీ నగరానికి చేరుకున్నట్లు, గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపింది. శ్యామలపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఈ మేరకు పంజగుట్ట పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేసి పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు.