Andhra pradesh anantapuram-man-gets-one-lakh-rupee-scratch-card-google-pay (Photo-Twitter)

Anantapur, Febuary 29: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పేలో (Google pay) ఎవరైనా డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే రివార్డు (scratch card) కింద మనకు ఎంతో కొంత డబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. అయితే అనంతపురంలోని ఓ యువకుడికి గూగుల్ పేలో జాక్ పాట్ తగిలింది. గూగుల్‌ పే ద్వారా స్నేహితుడికి నగదు బదిలీ చేసినందుకు ఆ యువకుడికి లక్ష రూపాయల రివార్డు లభించింది.

గూగుల్ పే వాడేవారికి శుభవార్త

అనంతపురం జిల్లా (Anantapur) పెనుకొండలో ఫొటో స్టూడియో నడుపుకునే సూర్యప్రకాశ్‌ అనే వ్యక్తి శుక్రవారం తన స్నేహితుడికి రూ.3 వేలను గూగుల్‌ పే యాప్‌లో బదిలీ చేశాడు. దాంతో అతడికి స్క్రాచ్ కార్డు రూపంలో రివార్డ్ వచ్చింది. దాన్ని స్క్రాచ్ చేసి చూస్తే.. ఏకంగా లక్ష రూపాయలు రివార్డ్ గా వచ్చింది.

సూర్యప్రకాశ్‌ బ్యాంకు ఖాతాకు రూ.1,00,107 జమ అయినట్టు గూగుల్‌ పే నుంచి మెసేజ్‌ వచ్చింది. ఊహించని విధంగా నగదు రావడంతో సూర్యప్రకాశ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడింది. గోల్డ్ లోన్ క్లియర్ చేశాను'' అని సూర్యప్రకాశ్ తెలిపాడు.

ఇప్పుడంతా అందరూ ఆన్ లైన్ పే మెంట్స్(online digital payments) చేస్తున్నారు. దీంతో గూగుల్‌ పే(google pay), పేటీఎం(paytm), ఫోన్ పే(phonepe) వంటి ఈ వ్యాలెట్ యాప్‌ల(e wallet apps) వినియోగం బాగా పెరిగింది. దీంతో కొన్ని యాప్ లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రివార్డ్స్ రూపంలో క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి.

రైల్వే స్టేషన్లలో ఇకపై ఉచిత వైఫై దొరకదు

ఈ విషయంలో గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే పోటీ పడుతున్నాయి. కాగా లాంచింగ్ సమయంలో గూగుల్ పే బంపర్ ఆఫర్లు ఇచ్చింది. చాలామంది రివార్డ్స్ రూపంలో వేల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత బాగా తగ్గింది.