Apple CEO Tim Cook (Photo Credit: Business Insider)

దేశీయ మొబైల్ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ సత్తా చాటింది. దేశంలో తన తొలి ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం ఆపిల్.. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినా, దేశీయంగా భారీ స్థాయిలో అమ్మకాలను (Apple saw record sales in India) నమోదు చేసింది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ (India Smartphone Row) విభాగంలో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్ ఆసియా పసిఫిక్ దేశాలతోపాటు ఇండియాలో ఈ త్రైమాసికంలో రికార్డు అమ్మకాలను సాధించామని ఫలితాల వెల్లడి సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (CEO Tim Cook) వెల్లడించారు.

భారతదేశంలో సెప్టెంబర్ 23న తమ ఆన్‌లైన్ స్టోర్ (Apple Online Store) ప్రారంభించిన నేపథ్యంలో మంచి ఆదరణ లభించిందని టిమ్ ప్రకటించారు. యూజర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిన్న (అక్టోబరు 29) క్యూ4 ఫలితాలను ఆపిల్ ప్రకటించగా.. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా పుంజుకుని 64.7 బిలియన్ డాలర్లుగా ఉంది. లాభం 7 శాతం తగ్గి 12.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఐఫోన్ గ్లోబల్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి.

గేమింగ్ అభిమానులకు షాక్, నేటి నుండి పబ్‌జీ ఎక్కడా కనపడదు, ఇండియాలో పబ్‌జీ సేవలన్నింటినీ ఆపేస్తున్నామని తెలిపిన టెన్సెంట్ గేమ్స్

మార్కెట్ పరిశోధన సంస్థ కెనాలిస్ జూలై-సెప్టెంబర్ కాలంలో ఇండియాకు ఆపిల్ 8 లక్షలకు పైగా ఐఫోన్లను (Apple iPhones) రవాణా చేసింది. తద్వారా రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదించింది. ధరల పరంగా మార్కెట్‌ను ఆపిల్ పూర్తిగా అర్థం చేసుకుంటోందనీ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11వంటి హాట్-సెల్లింగ్ ఫోన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో భారతీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో నెమ్మదిగా, స్థిరంగా ప్రవేశిస్తోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ వ్యాఖ్యానించారు. ఐఫోన్12తో రాబోయే త్రైమాసికంలో తన స్థానాన్ని ఆపిల్ మరింత పటిష్టం చేసుకుంటుందన్నారు.

ఆపిల్ తన కొత్త ఆన్‌లైన్ స్టోర్‌తో ఉత్సాహాన్ని పుంజుకుందనీ, ప్రీ-ఆర్డర్‌ల పరంగా ఐఫోన్ 12 సిరీస్‌కు మంచి ఆదరణ లభించిందని సీఎంఆర్ హెడ్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజి) ప్రభు రామ్ తెలిపారు. మరోవైపు అక్టోబర్ 23 న ప్రారంభించిన కొత్త ఐఫోన్లకు మంచి ఆదరణ లభిస్తోందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఫోన్ 12, 12 ప్రోలకు అద్భుతమైన ప్రీ-ఆర్డర్‌లను స్వీకరిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.