COVID Vaccine Booking on WhatsApp: వాట్సాప్‌‌ ద్వారా కరోనా వ్యాక్సినేషన్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఏ నంబర్ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేయాలో తెలుసుకోండి
COVID-19 Vaccine Slot Can Now Be Via WhatsApp (Photo Credits: Pixabay)

New Delhi, August 24: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఇకపై వాట్సాప్ (COVID Vaccine Booking on WhatsApp) లోనూ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోదలచినవారు కొవిన్ పోర్టల్ లో గానీ, నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద గానీ తమ వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ పొందేవారు. ఈ క్రమంలో కేంద్రం వ్యాక్సినేషన్ బుకింగ్ విధానంలో నూతన సదుపాయం కల్పించింది.

వాట్సాప్ లోనూ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునేందుకు (Book Your Vaccine Slot Via The Instant Messaging App) వీలుగా ఓ ఫోన్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. స్లాట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు 90131 51515 నెంబరుకు "బుక్ స్లాట్" అని సందేశం పంపాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. వాట్సాప్‌ ద్వారా కరోనా హెల్ప్‌ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్‌ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్‌ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

మళ్లీ అంతుచిక్కని కొత్త జ్వరం, యూపీలో 5 మంది చిన్నారులతో సహా ఆరుగురు మృతి, యూపీ, రాజస్థాన్‌లో రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య

ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్‌ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్‌ సర్టిఫికేట్టు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. వాట్సాప్‌ ద్వారా వ్యాక్సిన్‌ బుకింగ్‌ చేసుకోవడానికి మైగవ్‌ కరోనా హెల్ప్‌ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు.

వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి.

- మీ మొబైల్‌ నంబరులో 9013151515 నంబరు సేవ్‌ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్‌ స్లాట్‌ అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేసి మెసేజ్‌ పంపాలి.

- ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్‌ ఎంటర్‌ చేయాలి

- ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి

- హెల్ప్‌ డెస్క్‌ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్‌ సెంటర్‌ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి.

- ఈ హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ద్వారా వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది.