Google Play Store: ప్లే స్టోర్ నుంచి ఈ యాప్స్ డౌన్‌ లోడ్ చేస్తున్నారా? అయితే మీ గూగుల్ అకౌంట్ బ్లాక్ అవ్వడం ఖాయం, గూగుల్ తీసుకువచ్చిన కొత్త విధానం గురించి తెలుసుకోండి!
Google Play Store (Photo Credits: IANS)

New Delhi, JAN 25: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) ద్వారా ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ప్లే స్టోర్‌ నుంచి ఔట్ డేటెడ్ యాప్స్ (Outdated Apps) డౌన్‌లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం.. గూగుల్ వెంటనే మీ అకౌంట్ బ్లాక్ చేస్తుంది. ఆండ్రాయిడ్ డెవలపర్‌లు తమ యాప్‌లను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లతో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫారమ్‌లో భద్రతపరమైన చర్యలను అనుసరించేలా Google Play Storeలో కొత్త మార్గదర్శకాలను కఠినతరం చేస్తుంది. ఇటీవలి మార్గదర్శకాలలో గూగుల్.. తమ ప్లే స్టోర్‌లో కొత్తగా లిస్టు చేసిన యాప్‌లు ఆండ్రాయిడ్ 12 లేదా ఆపై వెర్షన్ లక్ష్యంగా అప్‌డేట్ చేసుకోవాలని Google పేర్కొంది. ఆ తర్వాత, గడువు ముగిసిన ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు సంబంధించిన యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను కూడా త్వరలో Google బ్లాక్ చేయనుంది.

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి అదిరే ఫీచర్, మీరు ఇక నుంచి తేదీల వారీగా మెసేజ్‌లు సెర్చ్ చేయవచ్చు, మీకు మీరే సందేశాన్ని కూడా పంపించుకోవచ్చు 

గూగుల్ నివేదిక ప్రకారం.. టెక్ దిగ్గజం Android వెర్షన్ 11 లేదా అంతకంటే ముందు వెర్షన్ యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తిగా బ్లాక్ చేయనుంది. ప్లే స్టోర్‌లో ఆయా యాప్‌లకు లింక్ చేసే మాల్వేర్ వ్యాప్తిని తగ్గించాలని గూగుల్ యోచిస్తోంది. Google ద్వారా కొత్తగా పోస్ట్ చేసిన కోడ్ మార్పును నివేదిక వివరించింది. ఆండ్రాయిడ్ 14తో, Google API- అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ అవసరాలను కఠినతరం చేస్తుందని వెల్లడించింది. ఆండ్రాయిడ్ యూజర్లు కాలం చెల్లిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు గూగుల్ అనుమతించదు. ముఖ్యంగా, Android 14తో చేసిన ఈ మార్పు నిర్దిష్ట APK ఫైల్‌లను సైడ్‌లోడ్ చేయకుండా లేదా ఏదైనా ఇతర యాప్ స్టోర్ నుంచి అదే యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండా యూజర్లను బ్లాక్ చేస్తుంది.

Korn Ferry Survey: జాబ్స్ కోతల్లో టెకీలకు గుడ్ న్యూస్, ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఈ ఏడాది భారీగా పెరగనున్న జీతాలు, కాన్ ఫెర్రీ తాజా వేత‌న స‌ర్వేలో వెల్లడైన నిజాలు 

‘కొత్త యాప్‌లు తప్పనిసరిగా Android 12 (API లెవల్ 31) లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. Wear OS యాప్‌లు తప్ప, ఆండ్రాయిడ్ 11 (API స్థాయి 30) లేదా అంతకంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకోవాలి. జనవరి 2023 నుంచి యాప్ అప్‌డేట్‌లు తప్పనిసరిగా Android 12 లేదా అంతకంటే ఆపై వెర్షన్లకు అప్‌డేట్ చేసుకోవాలి. Android 12లో Wear OS యాప్‌లు తప్ప, ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే ఎక్కువ వాటిని లక్ష్యంగా చేసుకోవాలని అని Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. Android 14 పాత Android వెర్షన్లను లక్ష్యంగా చేసుకునే యాప్‌లను మాత్రమే పరిమితం చేసి వాటిని బ్లాక్ చేస్తుంది. అయితే, భవిష్యత్తులో గూగుల్ ఆండ్రాయిడ్ 6.0 (Marshmallow)కి పెంచాలని యోచిస్తోంది. కాలం చెల్లిన యాప్‌ల కోసం థ్రెషోల్డ్‌ని నిర్ణయించడం లేదా ప్రారంభించాలా వద్దా అనేది డివైజ్ తయారీదారుల ఇష్టానికే వదిలేస్తుంది.

కొత్త యాప్‌లకు మాత్రమే వర్తించే ప్రొటెక్షన్లను కొన్ని మాల్వేర్ యాప్‌లు పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లను టార్గెట్ చేస్తున్నాయని చాలా మంది డెవలపర్‌లు వివరిస్తున్నారు. కాలం చెల్లిన యాప్‌లను బ్లాక్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్‌లో మాల్వేర్ యాప్‌ల వ్యాప్తిని అరికట్టాలని Google యోచిస్తోంది. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో తమ సిస్టమ్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని గూగుల్ సూచిస్తోంది. రాబోయే Android 14 వంటి కొత్త అప్‌డేట్‌లు ఫోన్ సెక్యూరిటీని మెరుగుపరచడానికి సైబర్ దాడుల నుండి మీ డేటా, డివైజ్‌ను ప్రొటెక్ట్ చేయడంలో సాయపడతాయని తెలిపింది. యాప్ సెక్యూరిటీ, స్టేబులిటీని మెరుగుపరిచేందుకు మొబైల్ యాప్ డెవలపర్‌లు తమ యాప్‌లను లేటెస్ట్ సిస్టమ్ OSకి సపోర్టుతో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు యాప్ డెవలపర్‌లు కొత్త ఫీచర్‌లను యాక్సెస్ చేయడంలో సాయపడతాయి. తద్వారా యాప్‌ల యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత ఉపయోగకరంగా వినియోగించుకునే వీలు ఉంటుంది.