ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ 15 సిరీస్ ఫోన్లు ఎట్టకేలకు మార్కెట్లో విడుదలయ్యాయి. ఐఫోన్ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్ స్మార్ట్ వాచీని విడుదల చేసింది.ఐఫోన్ 15 మోడళ్ల చార్జింగ్‌కు టైప్ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇతర యాపిల్ గాడ్జెట్లను సైతం టైప్ సీ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఐఫోన్ 15, 15 మ్యాక్స్, 15 ప్రో, 15ప్రో మ్యాక్స్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి
ఐఫోన్ 15, 15 ప్లస్ మోడళ్లకు ఏ 16 చిప్‌ను వినియోగించింది. వాచీ మోడళ్లకు రీసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందించిన విభిన్న స్ట్రాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల కేసు తయారీలో టైటానియంను వినియోగించింది. ఏ17 చిప్‌ను వినియోగించింది. తద్వారా అత్యంత వేగవంత, మన్నికైన, తేలికపాటి ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ తెలియజేసింది.
యూరోపియన్ యూనియన్ చాలా కఠినంగా అమలు చేస్తున్న అన్ని ఫోన్లు-ఒకే చార్జర్ కాన్సెప్ట్‌ను యాపిల్ కూడా తప్పనిసరిగా ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దీంతో ఏళ్ల తరబడి ఐఫోన్‌కే ప్రత్యేకమైన లైటెనింగ్ పోర్ట్ చరిత్ర పుటల్లోకి జారుకోనుంది. ఇకపై యాపిల్ ఉత్పత్తులన్నీ యుఎస్‌బీ-సీ కేబుల్‌తో కనెక్ట్ అయ్యేలా రానున్నాయి. దీంతో పాటు తేలికగా, మన్నికతో ఉండే టైటానియం చాసిస్ రంగప్రవేశం చేసింది. ఇక ఐఫోన్ ప్రారంభం నుండి ఉన్న మ్యూట్ బటన్ మాయమై, దాని స్థానంలో యాక్షన్ బటన్ ప్రవేశపెట్టబడింది. ఈ బటన్ ద్వారా ఫోన్లో మనం చేయాల్సిన పనులను మనకు కావలిసిన విధంగా మార్చుకునే వీలుంది.
ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, 15 ప్లస్‌కు 899 డాలర్లు చొప్పున నిర్ణయించింది. ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్లు కాగా, ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్లుగా ప్రకటించింది. కొత్త ఐఫోన్ మోడళ్లన్నీ 48 ఎంపీ ప్రధాన కెమెరాతో విడుదలయ్యాయి. 6.1, 6.7 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ప్రవేశపెట్టింది. స్టోరేజీ 128 జీబీ, 256 జీబీతో విడుదల చేసింది. ఈ అన్ని ఐఫోన్లు సెప్టెంబర్ 22 నుండి మార్కెట్లో ప్రవేశించనున్నాయి.
Here's Apple Hub Tweet
Here is everything Apple announced today at the #AppleEvent
Apple Watch Series 9
Apple Watch Ultra 2
iPhone 15 and iPhone 15 Plus
iPhone 15 Pro and iPhone 15 Pro Max
Will you be buying any new products? pic.twitter.com/6Ol2Hr9giq
— Apple Hub (@theapplehub) September 12, 2023
వీటితో పాటు యాపిల్‌వాచ్ 9 ను కూడా ఈ వండర్ లస్ట్‌లో ప్రవేశపెట్టారు. ఎస్9 చిప్‌తో పాటు, 18 గంటల బ్యాటరీ లైఫ్ దీని ప్రత్యేకతలు. వాచ్‌ఓఎస్10తో రానుంది. ధర – 399 డాలర్లు. అలాగే యాపిల్ వాచ్ అల్ట్రా2 కూడా విడుదల చేసింది. సాహసయాత్రికుల కోసం గతేడాది వచ్చిన అల్ట్రాకు కొనసాగింపిది. సిగ్నల్ లేకపోయినా సాటిలైట్ సహాయంతో పనిచేస్తుంది. కఠినమైన వాతావరణాలలోనూ, ఎక్కువ నీటి లోతుల్లోనూ ఇది నిరంతరాయంగా పనిచేస్తుంది. ధర – 799 డాలర్లు ఈ రెండు వాచ్‌లు ఈనెల 22 నుంచి మార్కెట్లో లభించనున్నాయి.
ఐఫోన్ 15 సిరీస్ ఫీచర్లు ఇవిగో..
ఐఫోన్ 15: సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్ : అల్యూమినియం, మెయిన్ కెమెరా : 48 ఎంపి, అల్ట్రా వైడ : 12ఎంపి, బ్యాటరీ : 3877 ఎంఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర: రూ. 79,900
ఐఫోన్ 15 ప్లస్: సైజు – 147.6 X 71.6 X 7.8ఎంఎం., తెర : 6.7 అంగుళాలు, బరువు : 171 గ్రా., చాసిస్ : అల్యూమినియం, మెయిన్ కెమెరా : 48 ఎంపి, అల్ట్రా వైడ : 12ఎంపి, బ్యాటరీ : 4912 ఎంఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర : రూ.89,900
ఐఫోన్ 15ప్రొ: సైజు-146.6 X 70.6 X 8.25ఎంఎం. తెర : 6.1 అంగుళాలు, బరువు : 188 గ్రా. చాసిస్ : టైటానియం, మెయిన్ కెమెరా : 48 ఎంపి, టెలీఫోటో: 12.7ఎంపి, అల్ట్రావైడ : 13.4 ఎంపి, బ్యాటరీ : 3650 ఎంఎహెచ్, ఓఎస్ : ఐఓఎస్ 17, ధర: రూ.1,34,900
ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ : సైజు – 159.9 X 76.7 X 8.25ఎంఎం. తెర : 6.7 అంగుళాలు బరువు : 221గ్రా. చాసిస్ : టైటానియం మెయిన్ కెమెరా : 48 ఎంపి, టెలీఫోటో: 12.7ఎంపి-85ఎంఎం పెరిస్కోప్, అల్ట్రా వైడ్ : 13.4 ఎంపి బ్యాటరీ : 4852 ఎంఎహెచ్ ఓఎస్ : ఐఓఎస్ 17 ధర : 1,59,900ల నుంచి.