E-Commerce Firms Sales: 20వ తేదీ నుంచి ఆన్‌లైన్ అమ్మకాలు, డోర్ డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు
Amazon, Flipkart (Photo Credits: IANS)

New Delhi, Apr 16: కరోనా లాక్‌డౌన్ (Coronavirus lockdown) అమలులో ఉన్న సమయంలోనూ ఏప్రిల్ 20వతేదీ నుంచి నిత్యావసరేతర వస్తువులను కూడా డెలివరీ చేసేందుకు ఈకామర్స్ కంపెనీలకు (E-Commerce Firms Sales) కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ 20 నుంచి మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ వస్తువులను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించడానికి అనుమతించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు.

ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే

మే 3 వరకు పొడిగించిన లాక్‌డౌన్ (Lockdown Extension) కాలానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సవరించిన మార్గదర్శకాలను జారీ చేసిన ఒక రోజు తర్వాత హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి నుండి ఈ స్పష్టత వచ్చింది. మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏప్రిల్ 20 నుంచి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయని అధికారి తెలిపారు.

ప్రస్థుతం ఈకామర్స్ కంపెనీలు నిత్యావసర వస్తువులు, ఆహారపదార్థాలు, ఔషధాలను మాత్రమే అందిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నందు వల్ల పిల్లలకు కొత్త ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్టేషనరీని ఆన్ లైన్ లో ఆర్డరు చేయవచ్చని ఈకామర్స్ కంపెనీలు ప్రకటించాయి.

జియో యాప్ అదిరిపోయే ఆఫర్, రీఛార్జ్ చేస్తే 4.16శాతం కమిషన్

ఏప్రిల్ 20వతేదీ నుంచి పూర్తి స్థాయిలో నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు ఫ్లిప్ కార్ట్, పేటీఎం మాల్, స్నాప్ డీల్ లు సమాయత్తమయ్యాయి. ఓడరేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులపై లారీల ద్వార రవాణాకు కేంద్రం అనుమతించింది. కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌసింగ్ గోదాములు తెరిచేందుకు అనుమతించడంతో అన్ని సరకులను డెలివరీ చేయనున్నారు.

కరోనావైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి 21 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు, దేశంలోని గుర్తించిన ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి అవసరమైన అవసరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతిస్తామని ప్రధాని మంగళవారం ప్రకటించారు.