Nokia కంపెనీ మార్కెట్లోకి కొత్తగా రెండు సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. ఈ మెడల్స్ పేర్లు ‘Nokia 110 4G, Nokia 110 2G’. ఈ రెండింటిలో ఇన్‌బిల్ట్ UPI యాప్‌ని అందించారు. Nokia 110 4G ధర రూ. 2,499గా ఉండగా.నోకియా 110 2G ధర రూ. 1,699గా ఉంది. ఇవి 1.8-అంగుళాల QVGA డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. వీటిలో MP3 ప్లేయర్, FM రేడియోను కూడా అందించారు.
నోకియా ఇండియా వెబ్‌సైట్, ఇతర ఎంపిక చేసిన అవుట్‌లెట్ల ద్వారా అమ్మకానికి ఉన్నాయి. రెండు ఫోన్లు కూడా దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్ చేయబడింది. 4G మోడల్ నానో సిమ్ సపోర్ట్ ఉంది, 2G మోడల్ మినీ సిమ్ కార్డ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 4G ఫోన్ HD వాయిస్ కాలింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది. దీనిలో 1,450mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కచార్జింగ్‌తో 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. నోకియా 110 4జీలో బలమైన 1450mAh బ్యాటరీ, నోకియా 110 2జీ ఫోన్‌లో 1000mAh బ్యాటరీ ఇచ్చారు.
నోకియా 110 4జీ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ఆర్కిటిక్ పర్పుల్ రంగుల్లో లభిస్తుండగా నోకియా 110 2జీ ఫోన్ చార్‌కోల్, క్లౌడీ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది.రెండు ఫోన్‌లలోనూ 32జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు
కామన్ ఫీచర్స్
1.8″ QQVGA డిస్‌ప్లే
QVGA రిజల్యూషన్‌తో కూడిన రియర్ కెమెరా
12 రోజుల స్టాండ్‌బై టైమ్, 8 గంటల టాక్ టైమ్ అందించే 1450mAh బ్యాటరీ. ( నోకియా 110 2Gలో 1000mAh బ్యాటరీ)
నానో ఆకృతిలో పాలికార్బోనేట్‌తో తయారు చేసిన బ్యాక్ ప్యానెల్
IP52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్
వైర్‌లెస్ FM రేడియో
S30+ ఆపరేటింగ్ సిస్టమ్
94.5 గ్రాముల బరువు
50mm x 121.5mm x 14.4mm కొలతలు