అక్టోబర్ నెల మరో రెండు రోజుల్లో ముగియనుండగా శుక్రవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంకు ఖాతాదారుడు తమ బ్యాంకు శాఖలను కొన్ని పనులకు తప్పక సందర్శించాల్సి వస్తోంది. ప్రస్తుతం సమయం ఎంతో విలువైనదైనందున ప్రతి ఒక్కరు తమ బ్యాంకు శాఖలను సంప్రదించడానికి వెళ్లే ముందు బ్యాంకులకు సెలవు ఉందా? లేదా? అన్న విషయం చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక నవంబర్ నెలలో జాతీయ, స్థానిక, ప్రాంతీయ సెలవు దినాలతో కలిపి 13 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఆదివారాలతోపాటు ప్రతి రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. బ్యాంకుల ఖాతాదారులు సెలవుల్లో మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. దీపావళి, చాట్ పూజ, గురునానక్ జయంతి వంటి పండుగల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రోజుల్లో బ్యాంకులు పని చేయవు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
నవంబర్ 1 – దీపావళి అమావాస్య
నవంబర్ 2 – దీపావళి (బాలి ప్రాతిపద)
నవంబర్ 3 :ఆదివారం
నవంబర్ 7 : చాట్ పూజ
నవంబర్ 8 : చాట్ పూజ
నవంబర్ 9 : రెండో శనివారం
నవంబర్ 10: ఆదివారం
నవంబర్ 12 : ఈగాస్ బాగ్వాల్
నవంబర్ 15 : గురునానక్ జయంతి
నవంబర్ 17 : ఆదివారం
నవంబర్ 18 : కనకదాస జయంతి
నవంబర్ 23 : సెంగ్ కుట్ స్నేమ్, నాలుగో శనివారం
నవంబర్ 24 : ఆదివారం
దీపావళి, కన్నడ జాతీయోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటో తేదీన త్రిపుర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. నవంబర్ 7,8 తేదీల్లో చాట్ పూజ సందర్భంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. గురునానక్ జయంతి సందర్భంగా 15న పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. కర్ణాట, మేఘాలయ రాష్ట్రాలకు నవంబర్ 18, 23 తేదీల్లో ప్రాంతీయ సెలవు దినం ప్రకటించారు.