దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ చేస్తూ జియో సముద్ర మార్గాన ఇంటర్నెట్ కేబుల్ (Reliance Jio Cable System) నిర్మాణాల్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలు త్వరలో మాల్దీవ్లోని హుల్ హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ (Jio Cable System To Connect Maldives) కానున్నాయి. సెకనుకు 200 టెరాబైట్స్ వేగంతో ఇంటర్నెట్ సామర్థ్యంతో జియో సంస్థ ముంబై, చెన్నై కేంద్రంగా పదహారు వేల కిలోమీటర్ల పొడవున సముద్రంలో కేబుల్స్‌ను వేస్తుంది.
ప్రస్తుతం ఈ కేబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ కేబుల్స్ నిర్మాణం మాల్దీవులోని హుల్‌హుమలే ప్రాంతం వరకు కనెక్ట్ అవుతున్నట్లు జియో తెలిపింది. తద్వారా భారత్, సింగపూర్‌లలో ప్రపంచంలోని ప్రధాన ఇంటర్నెట్ హబ్‌లతో కనెక్ట్ కానున్నాయి. జియోకి ఏమయింది, భారీగా షాక్ ఇస్తున్న యూజర్లు, డిసెంబర్ నెలలో 1.29 కోట్ల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో, 4.75 లక్షల మంది కొత్త యూజర్లను యాడ్ చేసుకున్న ఎయిర్‌టెల్
ఈ సందర్భంగా మంత్రి ఉజ్ ఫయాజ్ ఇస్మాయిల్ మాల్దీవుల మొదటి అంతర్జాతీయ కేబుల్ నిర్మాణం గురించి మాట్లాడుతూ..మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, నాణ్యమైన ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా మాల్దీవుల ప్రజలు ఆర్ధికంగా అన్నీ రంగాల్లోని అవకాశాల్ని అందిపుచ్చుకుంటారని కొనియాడారు. ఆర్థికాభివృద్ధితో పాటు, ఇది మాల్దీవుల అంతటా హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సామాజిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ఉజ్ ఫయాజ్ అన్నారు.