Reliance Jio (Photo Credits: Twitter)

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో రూ.349, రూ.899 రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. రూ.349 ప్లాన్‌లో రోజువారీ 2.5 జీబీ డేటా, ఉచిత కాల్స్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. 30 రోజుల్లో మొత్తం మీద 75జీబీ డేటా వినియోగించుకోవచ్చు. దీనికితోడు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. వెల్ కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను సైతం పొందొచ్చు.

ట్విట్టర్లో ఆగని ఉద్యోగాల కోత, మరో 50 మంది ఉద్యోగులపై వేటు వేయనున్న ఎలాన్ మస్క్, ఇప్పటికే 3400 మందిని ఇంటికి పంపించిన ట్విట్టర్

రూ.899 రీచార్జ్ ప్లాన్ లోనూ రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అలాగే, ఉచిత కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ లోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. మరోవైపు రిలయన్స్ జియో ఇప్పటి వరకు 100కు పైగా పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు పట్టణాల్లో జియో 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.