State Bank of India (Photo Credits: PTI)

దేశీయ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్​బీఐ) కస్టమర్లకు అలర్ట్ మెసేజ్ (SBI Customers Alert) జారీ చేసింది. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే నాలుగు యాప్‌లను మీ ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు అంటూ తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఈ యాప్స్ ద్వారా కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలు "ఖాళీ" చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత నాలుగు నెలల్లోనే మోసగాళ్ళు చెప్పిన మాటలు విని వాటిని డౌన్ లోడ్ చేసిన వ్యక్తులు కనీసం 150 మంది ఎస్​బీఐ వినియోగదారులు ₹70 లక్షలకు పైగా నష్టపోయినట్లు బ్యాంకు తెలిపింది.

ప్రతి ఒక్కరూ ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ అనే యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని (Avoid installing these 4 apps) బ్యాంక్ పేర్కొంది. అలాగే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ)ని ఉపయోగించేటప్పుడు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తెలియని సోర్స్ నుంచి క్యూఆర్‌ కోడ్‌ లేదా యూపీఐ కలెక్ట్‌ రిక్వెస్ట్‌ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది. ఎస్‌బీఐ పేరుతో పలు నకిలీ వెబ్‌సైట్‌లు ఉన్నాయని, తమ హెల్ప్‌లైన్‌ లేదా కస్టమర్‌ కేర్‌ నెంబర్లను వెతికేటప్పుడు అలాంటి వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకూడదని హెచ్చరించింది.

యూజర్లకు వాట్సాప్ షాక్, నవంబర్ నుంచి కొన్ని ఫోన్లకు సేవలు నిలిపివేత, శాంసంగ్‌, ఎల్‌జీ, ఎల్‌టీఈ, హువాయ్‌, సోనీ, అల్కాటెల్‌ ఇంకా ఇతర ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నామని వెల్లడి

ప్రతి డిజిటల్ లావాదేవీ పూర్తి అయిన తర్వాత, కస్టమర్ ఫోన్ కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఒకవేళ ఖాతాదరులు లావాదేవీ చేయకపోతే ఎస్ఎమ్ఎస్ లో వచ్చే నెంబరుకు ఆ సందేశాన్ని ఫార్వర్డ్ చేయాలి"అని ఎస్‌బీఐ తెలిపింది. ఒకవేళ ఏదైనా సైబర్ నేరం జరిగినట్లయితే, ఎస్‌బీఐ ఖాతాదారులు 1800111109, 9449112211, 08026599990 కస్టమర్ కేర్ నెంబర్లను సంప్రదించవచ్చు. అలాగే, 155260 నెంబరుకు కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించింది.