London, Oct 7: ప్రపంచ దేశాలను క్యాన్సర్ కేసులు (Cancer Cases) వణికిస్తున్నాయి. అయితే, ఒకే రక్త పరీక్షతో (Blood Test) 12 రకాల క్యాన్సర్లను ముందుగా పసిగట్టేలా వినూత్న ఆవిష్కరణను బ్రిటన్‌పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాన్సర్ లక్షణాలు రోగిలో బయటపడక ముందే ఈ రక్త పరీక్ష వ్యాధిని బయటపెడుతుందని సమాచారం. తద్వారా కొన్ని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణాపాయం తప్పుతుందని, స్కానింగ్‌లు, టెస్టుల కోసం కొన్ని నెలలపాటు రోగుల సమయం వృథా కాకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని క్యాన్సర్ చికిత్సలో ‘గేమ్ ఛేంజింగ్’గా అభివర్ణిస్తున్నారు.
A new 'game-changing' blood test will detect 12 types of cancers. Here's all about it#CancerNews
READ: https://t.co/2Xt2KceDcahttps://t.co/2Xt2KceDca
— WION (@WIONews) October 6, 2024
ఏయే క్యాన్సర్లు??
ఊపిరితిత్తులు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్.. ఇలా 12 రకాల క్యాన్సర్లను ఈ రక్త పరీక్ష గుర్తిస్తుందని పరిశోధకులు తెలిపారు.