Newdelhi, Nov 2: మీరు టైప్-1 డయాబెటిస్ తో (Type 1 Diabetes) బాధపడుతున్నారా? అయితే, ఈ వార్తా మీకు నిజంగా శుభవార్తే. టైప్-1 డయాబెటిస్ తో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ (Reprogramming) టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. రోగి శరీరంలోని కొవ్వు కణాలను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలుగా (ఐస్‌లెట్ కణాలు) మార్చడం ద్వారా టైప్-1 డయాబెటిస్ కు పరిశోధకులు చెక్ పెట్టారు. ఈ వివరాలు జర్నల్ ‘సెల్’లో ప్రచురితమయ్యాయి.
పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు.. ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
ఏమిటీ టైప్-1 డయాబెటిస్
శరీరంలో ఇన్సులిన్ ను ఐస్‌లెట్ కణాలు ఉత్పత్తి చేస్తాయి. ఇన్సులిన్ మోతాదు తగ్గితే షుగర్ వ్యాధి వస్తుంది. అయితే, శరీరంలోని రోగనిరోధక శక్తి.. ఈ ఐస్‌లెట్ కణాలను నాశనం చేయడంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో టైప్-1 డయాబెటిస్ వస్తుంది.