Xiaomi Republic Day Sale: షియోమి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, జనవరి 20 నుండి జనవరి 24 వరకు రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించిన చైనా దిగ్గజం

ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్ ‌ప్రకటించింది. ప్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ లాంటి దిగ్గజాలకు పోటీగా షియోమి (Xiaomi) కూడా రిపబ్లిక్ డే సేల్‌ను (Xiaomi Republic Day Sale) ప్రకటించింది.

Xiaomi Republic Day Sale: షియోమి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, జనవరి 20 నుండి జనవరి 24 వరకు రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించిన చైనా దిగ్గజం
Xiaomi Representational Image (Photo Credits; Xiaomi)

ప్రముఖ చైనా మొబైల్‌ దిగ్గజం షియోమి వినియోగదారులకు బంపర్‌ ఆఫర్ ‌ప్రకటించింది. ప్లిప్‌కార్ట్‌,అమెజాన్‌ లాంటి దిగ్గజాలకు పోటీగా షియోమి (Xiaomi) కూడా రిపబ్లిక్ డే సేల్‌ను (Xiaomi Republic Day Sale) ప్రకటించింది. షియోమి వెబ్‌సైట్ మి.కామ్‌లో (Mi.com) జనవరి 20 నుండి జనవరి 24 వరకు ఈ సేల్‌ నిర్వహిస్తోంది. అలాగే యాక్సిస్‌ బ్యాంకు కార్డు కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ కూడా షియోమి అందించనుంది. అలాగే ఎంఐ వీఐపీ క్లబ్ సభ్యులు ఈ రోజు (జనవరి 19) నుండే కొనుగోలుకు అనుమతి పొందవచ్చు.

ఈ సేల్ లో భాగంగా కంపెనీ రెడ్‌మి నోట్ 9 సిరీస్, రెడ్‌మి 9 ప్రైమ్, రెడ్‌మి 9ఐ స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇంకా రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ వాచ్ రివాల్వ్‌పై కూడా డిస్కౌంట్స్ అందించనుంది. వీటితోపాటు రెడ్‌మి ఇయర్‌బడ్స్, ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎంఐ టివి స్టిక్ సహా ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు , డిస్కౌంట్‌లను ప్రకటించింది.

రెడ్‌మి సిరీస్‌ లో (Redmi) ఆఫర్లును ఓ సారి చూస్తే.. రెడ్‌మి 9 ఐ 4 జీబీ + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999 లభ్యం. ఎంఆర్‌పీ ధర 8,299గా ఉంది. అలాగే రెడ్‌మి 9 ప్రైమ్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 9,499 రూ. 500 డిస్కౌంట్ లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 6జీబీ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999. ఇది రూ. 1,000 తగ్గింపుతో లభిస్తోంది. రెడ్‌మి నోట్ 9 ప్రో 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ప్రస్తుత ధర రూ.13,999. దీనిపై కంపెనీ రూ. 2,000. తగ్గింపును అందిస్తోంది. అలాగే రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ 6 జిబి + 64 జీబీ స్టోరేజ్ రూ. 17,499గా ఉంది. అలాగే పాత ఫోన్ల మార్పిడి ద్వారా 2,000 తగ్గింపు లభ్యం.

ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు కేంద్రం భారీ షాక్, ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమన్లు జారీ

దీంతో పాటు రిపబ్లిక్ డే సేల్‌లో ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై 1,000 రూపాయల తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్‌ఓ+యువి) వంటి ఇతర ఉత్పత్తులపై రూ. 3,000 డిస్కౌంట్ లభ్యమవుతోంది.

(The above story first appeared on LatestLY on Jan 19, 2021 07:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).