
Washington, July 29: సోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింస పెరిగిపోతున్నదనే ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజాలు విచారణ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. అమెరికన్ సెనేట్‌లో బుధవారం జరిగే విచారణ సందర్బంగా ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos), యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) , గూగుల్ దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు (Sundar Pichai) విచారణకు (Antitrust Hearing) హాజరుకానున్నారు. ఉత్తర కొరియాలో కరోనా కలకలం, తొలి కేసు నమోదుతో ఉత్తర కొరియా అధికారులు అప్రమత్తం, కెసోంగ్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్
ఈ విచారణలో సాంకేతిక దిగ్గజాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో వారు నిర్మంచిన దిగ్గజ సంస్థలు అమెరికన్ చట్టాలకు అనుగుణంగా ఎదిగిన తీరును వారు సమర్ధించుకోనున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు దిగ్గజ టెక్నాలజీ సంస్థల సీఈఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటారు.
అమెరికన్ కంపెనీగా ఫేస్‌బుక్ ఎదిగిన తీరు గర్వకారణమని అంటూ పోటీతత్వాన్ని ప్రేరేపించే అమెరికన్ చట్టాల ఆసరాతో తమ కంపెనీ ఎదిగిందని ఈ విచారణలో ఫేస్‌బుక్ చీఫ్ జుకర్‌బర్గ్ తెలిపారు.నికారక కంటెంట్, గోప్యత, ఎన్నికల సమగ్రత వంటి కీలక అంశాలపై కంపెనీలు ఇష్టానుసారం తీర్పులు ఇవ్వరాదన్నది తన అభిమతమని ఇప్పటికే జుకర్ బర్గ్ తెలిపారు. హింసను ప్రేరేపించే విద్వేష కంటెంట్‌ను కట్టడి చేయడంలో ఫేస్‌బుక్ విఫలమైందనే ఆరోపణల నడుమ కమిటీకి ఫేస్‌బుక్ అధినేత ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.
ఇక ఇంటర్‌నెట్ నిబంధనల మార్పుపై అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ గట్టిగా నొక్కి చెప్పనున్నారు. అమెరికా విజయ ప్రస్ధానంగా అమెజాన్‌ను ఆయన అభివర్ణిస్తూ అమెజాన్‌లోనూ నిబంధనల పరిశీలన అవసరమని తాను నమ్ముతానని విచారణకు ముందు బెజోస్ ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానించారు. జెఫ్ బెజోస్ కాంగ్రెస్ ఎదుట విచారణకు హాజరవడం ఇదే తొలిసారి.
ఇదిలా ఉంటే సమాచార గోప్యత నుంచి డేటా దుర్వినియోగం వరకూ విచారణ సందర్బంగా జ్యుడిషియరీ కమిటీ సాంకేతిక దిగ్గజాలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని భావిస్తున్నారు. మార్కెట్‌ప్లేస్‌లో తమ అధికారాలను వీరు దుర్వినియోగం చేస్తున్నారా అనే కోణంలోనూ జ్యుడిషియరీ కమిటీ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ప్రస్తుత అమెరికా యాంటీట్రస్ట్ చట్టాలను మార్చడంపైనా వారి అభిప్రాయాలు కోరనున్నట్లు సమాచారం.