Seoul, July 26: ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ఉత్తర కొరియాలో కరోనా కలకలం (North Korea Coronavirus) నెలకొన్నది. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఆదివారం రాత్రి లక్షణాలున్న ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా (COVID-19 Case) నిర్ధారణ అయ్యింది. ఆ దేశం అధికారికంగా ప్రకటించిన తొలి కేసు ఇదేకావడం గమనార్హం. మరోవైపు వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేసాంగ్ నగరంలో లాక్‌డౌన్ (Kaesong Lockdown) విధించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong-un) నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా, హౌస్టన్ చైనా రాయబార కార్యాలయం మూసివేత, కోవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయన పత్రాలు చైనా హ్యాక్ చేసిందని ఆరోపణలు
కరోనావైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వారితో మెలిగిన వారందరినీ కఠినమైన క్యారెంటైన్ నిబంధనలు వర్తించే విధంగా నిర్బంధించాలని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 976 పరీక్షలు నిర్వహించామని వారిలో ఏ ఒక్కరినీ కరోనా పాజిటివ్‌గా తేలలేదని అధికారులు అధ్యక్షుడికి వివరించారు. కోవిడ్ 19 లక్షణాలు ఉన్న 25,551 మందిని క్వారైంటైన్ చేశామని.. అందులో 255 మంచి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు వివరించామని పేర్కొన్నారు.
సరిహద్దు నగరమైన కెసోంగ్ కు చెందిన ఒక వ్యక్తి మూడేండ్ల కిందట దక్షిణ కొరియాకు పారిపోయాడు. కాగా అతడు ఈ నెల 19న సరిహద్దుగుండా అక్రమ మార్గంలో తిరిగి వచ్చాడు. అయితే అతడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తిని వెంటనే క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అలాగే సరిహద్దు నుంచి ఆ వ్యక్తి అక్రమంగా దేశంలోకి ప్రవేశించడంపై మిలిటరీ దర్యాప్తునకు ఆదేశించారు.