Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, December 16: కోవిడ్..ఇప్పుడు ఈ మూడక్షరాల పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆ దేశం..ఈ దేశం అని లేకుండా యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలే సంక్షోభంలోకి వెళ్లాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కరోనావైరస్ కి (Covid-19 virus) వ్యాక్సిన్ అనేది ఇప్పటికీ అందుబాటులో లేదు. ఈ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందనేది కూడా ఇంకా అంతుచిక్కడం లేదు. ఎవరికి తోచిన వాదనలు వారు వినిపిస్తున్నారు. తాజాగా ఈ వైరస్ లీక్ మీద ఓ కొత్త న్యూస్ బయటకు వచ్చింది.

కరోనావైరస్ మానవ నిర్మితమైనదని ఇది ప్రయోగశాల నుండి “అనుకోకుండా” లీక్ (Coronavirus Leaked Accidentally From a Lab) అయిందని నార్వేజియన్ వైరాలజిస్ట్ బిర్గర్ సోరెన్‌సెన్ పేర్కొన్నారు. స్వీడన్ వార్తా సంస్థ ఫ్రియా టైడర్‌తో మాట్లాడుతూ, బిర్గర్ సోరెన్‌సెన్ కరోనావైరస్ యొక్క నిర్మాణం మరియు దాని వేగవంతమైన వ్యాప్తి జంతువుల నుండి రాలేదని నిర్ధారిస్తుందని అన్నారు. ఈ కోవిడ్ వైరస్ ఆగస్టు లేదా సెప్టెంబర్ 2019 లో ఒక ల్యాబ్ నుండి ప్రమాదవశాత్తు లీక్ అయిందని నార్వేజియన్ వైరాలజిస్ట్ (Norwegian Virologist) తెలిపారు.

చైనాలో మరో ప్రమాదకర వైరస్, ఎస్ఎఫ్‌టీఎస్ దెబ్బకు ఏడు మంది మృతి, 60 మంది ఆస్పత్రిలో చేరిక, మ‌నుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ

"ఇది ప్రమాదవశాత్తు వ్యాపించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 2018 లో వుహాన్‌లో అమెరికా అధికారులు తనిఖీ నిర్వహించినప్పుడు, దీనిని రిస్క్ ల్యాబ్‌గా అభివర్ణించారు”అని సోరెన్‌సెన్ పేర్కొన్నారు. "అనేక ప్రయోగశాలలు ఉన్నాయి, అవి ఈ వైరస్లను పొరపాటున విడుదల చేశాయి. అసలు సార్స్ వైరస్ సింగపూర్ నుండి విడుదలైంది. గత ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో ఈ కరోనావైరస్ లీక్ అయిందని ఆయన అన్నారు.

చైనాలో మళ్లీ వేల మందికి కొత్త వైరస్, జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అవయవాల వాపు, సంతాన సాఫల్యతలకు కారణమవుతున్న బ్రూసిల్లోసిస్‌ బ్యాక్టీరియా, జంతువుల ద్వారా వ్యాప్తి

"క్లాస్ 3 మరియు క్లాస్ 4 ప్రయోగశాలల నుండి వైరస్లు లీక్ (Coronavirus leaked from a lab) అయినందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. కరోనావైరస్ ఆగష్టు రెండవ సగం, 2019 సెప్టెంబర్ ప్రారంభంలో లీక్ అయిందని నేను అనుకుంటున్నాను. దానిని సూచించడానికి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయని నార్వేజియన్ వైరాలజిస్ట్ చెప్పారు. వైరస్ ప్రయోగశాల నుండి వచ్చిందని ప్రజలు విశ్వసించాలని శాస్త్రీయ సమాజం కోరుకోవడం లేదని, ఎందుకంటే ఇది వైరస్లపై భవిష్యత్ పరిశోధన పనులను నిలిపివేయడానికి దారితీస్తుందని ఆయన అన్నారు.

ఓవైపు కరోనా..మరోవైపు ఎబోలా, కాంగోలో ఎబోలా వైరస్ దెబ్బకు నలుగురు మృతి, 11సార్లు కాంగోలో వ్యాధి విజృంభణ, ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ

"భవిష్యత్తులో వైరస్ పరిశోధనకు ఆటంకం కలిగించే సమస్యలను చర్చించడానికి శాస్త్రీయ సంఘం ఇష్టపడదు" అని సోరెన్‌సెన్ అభిప్రాయపడ్డారు, కరోనావైరస్ ప్రకృతి నుండి వచ్చిందని ఇప్పటివరకు ఎవరూ నిరూపించలేకపోయారు. “వైరస్ ప్రకృతి నుండి వచ్చిందని నిరూపించబడాలి అని ప్రశ్నించేవారు ఎవరూ లేరు. ఇది ప్రకృతి నుండి వచ్చినదని మీరు నిరూపించుకోవాలి, లేకపోతే అది ప్రయోగశాల నుండి వస్తుంది ”అని ఆయన నొక్కి చెప్పారు.