Representational picture

San Francisco, March 30: హ్యాకర్లు చెలరేగిపోయారు. పాపుల‌ర్ ఆన్‌లైన్ గేమ్ ఎక్సీ ఇన్‌ఫినిటీ లెడ్జ‌ర్ నుంచి సుమారుగా 625 మిలియ‌న్ల డాల‌ర్ల విలువైన క్రిప్టోకరెన్సీని హ్యాక‌ర్లు (Cryptocurrency Heist) దొంగ‌లించారు. ఇటీవ‌ల క్రిప్టోక‌రెన్సీకి డిమాండ్ పెర‌గ‌డంతో.. టెక్ దొంగ‌లు ఈ మ‌నీని టార్గెట్ చేస్తున్నారు. 1,73,600 ఈత‌ర్ల‌తో పాటు 25.5 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన స్టేబుల్‌కాయిన్‌ను డిజిట‌ల్ లెడ్జ‌ర్ నుంచి చోరీ చేసిన‌ట్లు రోనిన్ నెట్‌వ‌ర్క్ తెలిపింది.  అమ్మాయిగా పేరు మార్చుకున్న ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్‌లో ఎలోనా మస్క్ పేరుతో ట్వీట్లు సంధిస్తున్న టెస్లా అధినేత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో నేరుగా పుతిన్‌తోనే ఢీకొట్టిన ఎలోన్ మస్క్

మార్చి 23వ తేదీన చోరీ జ‌రిగిందని (Hacker Steals $625 Million) కంపెనీ తెలిపింది. ఆ స‌మ‌యంలో ఆ క‌రెన్సీ విలువ సుమారు 545 మిలియ‌న్ల డాల‌ర్లు. అయితే మంగ‌ళ‌వారం నాటి ధ‌ర‌ల‌తో పోలిస్తే ఆ విలువ 615 మిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని బావిస్తున్నారు. కాగా క్రిప్టో ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చోరీల్లో ఇదే అతిపెద్ద‌ద‌ని రోనిన్ నెట్వ‌ర్క్ ( Blockchain Platform Ronin) తెలిపింది. దొంగ‌లించిన క‌రెన్సీ ఇంకా హ్యాక‌ర్ల వ్యాలెట్‌లోనే ఉన్న‌ట్లు ఆ సంస్థ చెప్పింది. ఇత‌ర క‌రెన్సీ విత్‌డ్రా కోసం మంగ‌ళ‌వారం ఓ వినియోగ‌దారుడు ప్ర‌య‌త్నించాడు. అయితే ఆ స‌మ‌యంలో ఎక్సీ ఇన్‌ఫినిటీలో చోరీ జ‌రిగిన‌ట్లు గుర్తించారు. హ్యాకింగ్ ఘ‌ట‌న‌పై రోనిన్ సంస్థ విచార‌ణ చేప‌డుతోంది. హ్యాక‌ర్ల వ‌ద్ద డిజిట‌ల్ ఫండ్స్‌కు చెందిన విత్‌డ్రా కీ ఉన్న‌ట్లు తెలుస్తోంద‌న్నారు