COVID-19 Outbreak in India | File Photo

Geneva, August 14: ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ పంజా (Global coronavirus) విప్పుతోంది. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నా క‌రోనా విస్తృతికి (Coronavirus Scare) మాత్రం అడ్డుక‌ట్ట ప‌డ‌టంలేదు. నిన్న ప్ర‌పంచ దేశాల‌న్నింటిలో క‌లిపి దాదాపు ఏడు ల‌క్ష‌ల మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అదేవిధంగా 10 వేల మందికి పైగా క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌, ఇరాన్ త‌దిత‌ర దేశాల్లో వైరస్‌ ప్రమాదకరంగా మారింది.

గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక్క అమెరికాలోనే (Coronavirus in US) దాదాపు 1.16 లక్షల కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. ఇరాన్‌లో (Cronavirus in Iran) 39 వేలకు పైగా కేసులు, 568 మరణాలు చోట‌చేసుకున్నాయి. బ్రిటన్‌లోనూ (Covid in Britan) కొత్త‌గా నిన్న దాదాపు 33 వేల మందికి కొవిడ్‌ సోకింది. జాన్‌హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,60,62,557 మందికి పైగా వైరస్‌ సోకగా 44,35,111 మందికి పైనే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో 18.5 కోట్ల మందికి పైగా కోలుకున్నారు.

దేశంలో పెరుగుతున్న డెల్టా వేరియంట్‌ కేసులు, తాజాగా 38,667 కరోనా కేసులు నమోదు, కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, భారత్‌లో 3,21,56,493కు చేరుకున్నమొత్తం కేసుల సంఖ్య

ఆస్ట్రేలియాలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో సిడ్నీలో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. కరోనా డెల్టా వేరియంట్‌కు అడ్డుకట్టవేయడంలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అదనపు మిలిటరీ సిబ్బందిని కూడా రంగంలోకి దించుతున్నట్టు న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రభుత్వం వెల్లడించింది. డెల్టా వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న‌ద‌ని, దాని కట్టడి కోసం గురువారం సాయంత్రం నుంచి వారంపాటు ఆంక్ష‌లు అమ‌లుచేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

135కు పైగా దేశాల్లోకి విస్తరించిన డెల్టా వేరియంట్‌ కారణంగానే కేసులు వేగంగా పెరుగుతున్నాయి. డెల్టా విజృంభణతో అమెరికా, బ్రిటన్‌ దేశాలు మరింత ప్రమాదంలోకి జారుకున్నాయి. అగ్రరాజ్యంలో రోజూవారీ కేసులు లక్షన్నర దాటుతుండగా, బ్రిటన్‌లో రోజూ సుమారు 35 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా తొలిసారిగా వెలుగుచూసిన చైనాలోనూ వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజూవారీ కేసులు వంద మార్కును దాటుతుండటంతో మహమ్మారి కట్టడికి అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు రాకుండా బయటినుంచి తాళాలు, ఇంటి తలుపులకు అడ్డుగా ఇనుపరాడ్లను పెట్టి దిగ్బంధిస్తున్నారు.

మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్, యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ బ‌యోటెక్

ఇదిలా ఉంటే చైనాలో తొలి కరోనా కేసు నమోదు అయినట్టుగా భావిస్తున్న వూహాన్‌ చేపల మార్కెట్‌ సమీపంలోని వైరాలజీ ల్యాబ్‌ భద్రతా ప్రమాణాలపై డబ్ల్యూహెచ్‌వో శాస్త్రవేత్త బెన్‌ ఎంబారెక్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనవరిలో ఓ కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ల్యాబ్‌లో పనిచేసేవారికి తగిన నైపుణ్యం, అక్కడ ప్రమాణాలకు తగిన విధంగా భద్రత ఉన్నాయో..లేవో ఎవరికి తెలుసు’ అని అన్నారు. ఈ మేరకు డెన్మార్క్‌ టీవీ చానల్‌ టీవీ2 గురువారం ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.