Holy, Feb 27: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు(Hijab protest) ఇరాన్(Iran)ను కుదిపేశాయి.ఈ నేపథ్యంలో అక్కడ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం (Schoolgirls Poisoned in Iran) జరిగింది.బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు.
ఇదంతా (Hundreds Of Girls Poisoned) బాలికల పాఠశాలలను మూసివేసి, వారిని విద్యకు దూరం చేసేందుకే అని వెల్లడించారు. దీని వెనక ఎవరున్నారు..? అనే విషయాలను మాత్రం ఆయన పేర్కొనలేదు. అలాగే ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోలేదు. కాగా ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ వీడియోలు బయటకు వచ్చిన సంగతి విదితమే.
తాజాగా ఈ దారుణం వెలుగులోకి రావడంతో విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ విషప్రయోగ ఘటనపై ఫిబ్రవరి 14న బాధితుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగగా.. దీనికి గల కారణాలను గుర్తిస్తున్నామని ప్రభుత్వం స్పందించింది.
ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుపోతోంది.