Kartarpur-Ready-To-Welcome-Sikh-Pilgrims-Says-Pak-PM-Imran-Khan-Shares-Photes (Photos-Twitter)

New Delhi, November 4: మరో కొద్ది రోజుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడులపై ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో అందరికీ స్వాగతం పలికారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు సిక్కు యాత్రికులను ఆహ్వానించేందుకు గౌరవప్రదమైన వేదిక సిద్ధంగా ఉందని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. కర్తార్‌పూర్‌ కాంప్లెక్స్‌, గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ చిత్రాలను ఆయన ఆదివారం ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గురు నానన్‌ జీ 550 జయంతి వేడుకల సందర్భంగా అనుకున్న సమయానికి కర్తార్‌పూర్‌ నిర్మాణ పనులు పూర్తి చేసిన తన ప్రభుత్వానికి మరో ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

అంతకముందు కర్తార్‌పూర్‌ను ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న వారికి విధించిన పాస్‌పోర్ట్‌ షరతు, 20 డాలర్ల సేవా రుసుమును ఇమ్రాన్‌ ఖాన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని నంకన సాహిబ్‌లో జన్మించిన సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550వ జయంతిని పురస్కరించుకుని ఈ కారిడార్‌ను ప్రారంభిస్తున్నారు.కాగా, కర్తార్‌పూర్‌ ఒప్పందంపై గతనెలలో భారత్‌-పాకిస్థాన్‌ ప్రతినిధులు సంతకం చేశారు.

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ 

గురునానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్ లోనే గడిపారు. ఇది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న సరోవర్ జిల్లాలో ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.