Mohammed Muizzu (Credits: X)

Newdelhi, June 28: ఆధునిక వైజ్ఞానిక విధానాలు, చదువుకు దూరంగా ఉండే పల్లెలు, కుగ్రామాల్లో చేతబడి, క్షుద్రపూజలు అనే మూఢనమ్మకాలు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. అయితే, ఓ దేశంలో అదీ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడి మీదనే క్షుద్రపూజలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీనికి కారణమైన ఇద్దరు మంత్రులను అరెస్ట్ కూడా చేశారు. యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జుకు (Mohammed Muizzu) వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గ సహచరులైన ఇద్దరు వ్యక్తులు క్షుద్రపూజలు (Black Magic) చేశారన్న వార్తలు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇద్దరు మంత్రులను అరెస్టు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. పర్యావరణ సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా ఉన్న ఆమె మాజీ భర్త రమీజ్‌ లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు (Arrest) చేశారట. అయితే, అటు పోలీసులు, ఇటు ప్రభుత్వవర్గాలు ఈ విషయంలో ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

అమెరికాలో పెరిగిన తెలుగోళ్ల డామినేష‌న్, ఏకంగా 12 ల‌క్ష‌లకు పైగా తెలుగు మాట్లాడేవాళ్లు ఉన్న‌ట్లు ఓ సర్వేలో వెల్ల‌డి

దగ్గరి వ్యక్తులే..

ముయిజ్జు మాలె సిటీ మేయర్‌ గా ఉన్నప్పుడు షమ్నాజ్, రమీజ్ ఇద్దరూ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. అధ్యక్షుడితో వారికి దగ్గరి సాన్నిహిత్యం ఉన్నట్టు మీడియా వివరించింది. దగ్గరి వ్యక్తులే ఇలా ఆయనకు ప్రమాదాన్ని కలిగించేలా ప్రవర్తించారని ఆరోపించింది.

ఎండ వేడికి కరిగిపోయిన అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మైనపు విగ్రహం, ఫోటో ఇదిగో..