Mali President Resigns: మాలి దేశంలో సైనికుల తిరుగుబాటు, రక్తపాతం వద్దంటూ దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా రాజీనామా, రద్దయిన పార్లమెంట్
Mali President Ibrahim Boubacar Keita (Photo Credits: Wikipedia)

Bamako, August 19: పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూబంధిత దేశంలో సైనికులు తిరుగుబాటను లేవదీశారు. వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా మాలిలో నిరంతర ఆందోళనల ఫలితంగా మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీటా మంగళవారం అర్దరాత్రి తన పదవికి రాజీనామా (Boubacar Keita resigns) చేశారు. తన పదవీకాలం ముగియడానికి మూడు సంవత్సరాల ముందే ఇబ్రహీం తన పదవి నుంచి దిగిపోయారు. మాలి దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకునే ముందు అతని ఇంటి బయట విజయ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

కొవిడ్ -19 మహమ్మారి వల్ల ముఖానికి మాస్క్ ధరించిన ఇబ్రహీం దేశాధ్యక్షుడిగా తన రాజీనామా (Mali President Resigns) వెంటనే అమలులోకి వస్తుందని జాతీయ టీవీలో ప్రకటించారు. దేశంలో రక్తం పారవద్దని తాను రాజీనామా చేస్తున్నట్లు ఇబ్రహీం (Ibrahim Boubacar) చెప్పారు. దేశంలో ఒక పక్క సైనికులు నిరసనలు చేస్తుండగా.. మరోపక్క కరోనా తీవ్రత పెరుగుతోందని ఆయన అన్నారు. ఎనిమిదేళ్లుగా సైనిక తిరుగుబాటు జరుగుతుందని.. అందుకే తన ప్రభుత్వం మరియు జాతీయ అసెంబ్లీ కూడా రద్దు చేయబడుతుందని ఆయన ప్రకటించారు. 2013లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కీటా మళ్లీ 2018లో కూడా తిరిగి దేశాధ్యక్షడిగా ఎన్నికయ్యారు.

తిరుగుబాటు చేసిన సైనికులు గారిసన్ పట్టణంలోని ఆయుధగారం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొని బమాకో రాజధాని నగరానికి వచ్చారు. తిరుగుబాటు సైనికులు బమాకో రాజధానిలో తిరుగుతూ దానిని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మాలి దేశం సైనికపాలనలోకి వెళ్ళింది. అధ్య‌క్షుడితోపాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వ‌చ్చారు. అమెరికాను ఈ సారి నడిపించేదెవరు? జో బిడెన్‌ను తమ అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ చేసిన డెమోక్రటిక్‌ పార్టీ, నవంబర్‌ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు

సైనికులు అదుపులోకి తీసుకున్న నేతల్లో అధ్యక్షుడు కేటీ కుమారుడు, జాతీయ అసెంబ్లీ స్పీకర్, విదేశాంగ, ఆర్థిక మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తిరుగుబాటులో ఎంతమంది సైనికులు పాల్గొన్నారనేది ఇంకా స్పష్టంగా తెలీడంలేదు. 2012లో జరిగిన తిరుగుబాటులో కూడా కటీ క్యాంప్ వార్తల్లో నిలిచింది. ఉత్తర మాలీని తమ నియంత్రణ తెచ్చుకున్న ట్వారీ రెబల్స్, జిహాదీలను అడ్డుకోవడంలో కమాండర్ల అసమర్థతపై ఆగ్రహంతో సైనికులు అప్పుడు తిరుగుబాటు చేశారు. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం, పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డర్ జారీ చేసిన కిమ్ జాంగ్, కుదేలైన వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు

2018లో జరిగిన ఎన్నికల్లో కీతా రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కానీ అవినీతి, ఆర్థికవ్యవస్థను చక్కదిద్దకపోవడం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మత హింసపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఇస్లాం తిరుగుబాటును బౌబాకర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా మాలిలో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. మితవాద మత పెద్ద మహమూద్ డికో నేతృత్వంలో ఏర్పడిన ఒక కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ కీటా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు చేసిన సైనికులు కీటా క్యాంపులో ఉన్న ఇబ్రహీం బౌబాకర్‌తో పాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను తమ అధీనంలోకి తీసుకున్నారు. చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ సంక్షోభం, తరుముకొస్తున్న కరువు ఛాయలు, క్లీన్ యువర్‌ ప్లేట్‌ ఉద్యమం మొదలుపెట్టిన చైనా అధినేత జీ జిన్‌పింగ్‌

దేశంలో పాలన సైన్యం చేపట్టినట్టు ఇంకా స్పష్టతలేదు. మాలీలో సైనిక తిరుగుబాటును ఒకప్పుడు ఆ దేశంపై అధిపత్యం చెలాయించిన ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికా యూనియన్‌లు తీవ్రంగా ఖండించాయి. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాయి. మాలిలో సైద్ధాంతికంగా సాయుధ దళాలు అధికారం కోసం ప్రేరేపించడంతో దేశంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇది పొరుగు దేశాలైన నైజర్, బుర్కినా ఫాసోకి పాకడంతో ఆ ప్రాంతంలో అస్థిరత, భారీ మానవ సంక్షోభాన్ని (Mali crisis) సృష్టించాయి.

మాలీలో తిరుగుబాటు జరిగిందనే వార్తలు రాగానే.. సైనికులు తాము బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి, ఆఫ్రికా యూనియన్ కోరాయి. మాలీతో సరిహద్దులు మూసివేయడానికి, ఆ దేశంతో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు నిలిపేయడానికి, నిర్ణయాత్మక సంస్థల నుంచి మాలిని తొలగించడానికి 15 సభ్య దేశాలు అంగీకరించాయని ప్రాంతీయ సంస్థ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ (Ecowas) చెప్పింది. గత కొన్ని నెలలుగా ఇది కీటా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.