Florida,October 6: మామ పుట్టిన రోజుకు ఊహించని బహుమతి ఇవ్వాలనుకున్న అల్లుడు మామా చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే క్రిష్టోఫర్ బెర్గాన్ నార్వేలో నివసిస్తున్నాడు. అతని మామ డెన్నిస్ అమెరికాలోని ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. మామ డెన్నిస్ 61వ జన్మదినం సందర్భంగా అభినందనల్లో ముంచెత్తాలని, మామకు బర్త్‌డే కి సర్ ప్రైజ్ ఇవ్వాలని అల్లుడు క్రిష్టోఫర్ బెర్గాన్ నార్వే నుంచి ఏకంగా 4500 మైళ్లు దాటి ఇంటికి వచ్చాడు. అయితే అతను నేరుగా ఇంటిలోకి వెళ్లి ఉంటే ఏ సమస్య ఉండేది కాదు. కాని అతను చేసిన పొరపాటే అతన్ని బలి తీసుకుంది, సర్ ఫ్రైజ్ ఇద్దామనే ఆలోచనలో వెనుక ఇంటి గేటు నుంచి లోపలకి దూకి మామాను ఆశ్చర్యపరచాలని ఆశపడ్డాడు.
అయితే వెనుక తమ ఇంటి బ్యాక్‌డోర్ వద్ద అలికిడి కావడంతో మామ ఎవరో లోపలకి దూకారని భయపడి తన దగ్గరున్న తుఫాకితో కాల్పులు జరిపాడు. తుపాకీ గుళ్లు నేరుగా బెర్గాన్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. తీరా అతను దగ్గరికి వెళ్లి చూస్తే అతను తన అల్లుడే. దీంతో తాను షూట్ చేసింది తన అల్లుడినేనని తెలుసుకున్న డెన్నిస్ వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేయగా అప్పటికే మరణించినట్టు వారు నిర్ధారించారు.
మీడియా సమావేశంలో వెల్లడిస్తున్న ఇన్విస్టిగేషన్ టీం
డెన్నిస్ పొరపాటున ఈ పనిచేయడంతో అతనిపై నేరాభియోగాలు మోపబోమని ఇది విషాద ఘటనని అధికారులు పేర్కొన్నారు. నార్వే పౌరుడైన బెర్గాన్ తన భార్యతో కలిసి స్వదేశంలో స్ధిరపడే ముందు పలు సంవత్సరాలు ఫ్లోరిడాలో ఉన్నారు. మరోవైపు జరిగిన ఘటనతో డెన్నిస్ కుటుంబం విషాదంలో మునిగింది.