Drowning | Representative Image (Photo Credits: ANI)

నైజీరియాలోని నైజర్‌ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లి వెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నైజీరియాలో  100 మందికిపైగా గల్లంతైన ఘటనలు 2023 నుంచి ఇప్పటివరకు నాలుగు చోటుచేసుకున్నాయి.

మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..

తాజాగా నైజర్‌ నదిలో 300 మందితో ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన స్థానిక ఈతగాళ్లు, వాలంటీర్లు గాలింపు చర్యలు చేపట్టారు. 150 మందిని రక్షించగలిగారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు బయటకు తీసుకొచ్చారు. మిగతావారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.