Newdelhi, June 19: పవిత్ర హజ్ యాత్రలో (Hajj Pilgrims) భానుడి భగభగలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి తాళలేక యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ తీవ్రత, వడ గాలులతో ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందారు. ఈ మేరకు మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. వీరంతా వేడి సంబంధిత సమస్యలతోనే మరణించినట్లు వెల్లడించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కాలోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన అల్-ముయిసెమ్ ఆసుపత్రి మార్చురీలో మొత్తం 550 మృతదేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత సమస్యలతో బాధపడిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.
BREAKING: More Than 550 Hajj Pilgrims Die In Mecca In Blazing Heat Nearing 52 Degrees - NDTV https://t.co/eH786ZukcZ
— Live News Feed (@newsnetworks) June 19, 2024
బాధితులు ఈ దేశస్థులే
ఇక చనిపోయిన వారిలో ఈజిప్ట్, జోర్డాన్ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని తెలిపారు.