Omicron Surge: ఒమిక్రాన్‌తోనే పోలేదు, కొత్తగా మరిన్ని అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకువస్తాయి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
World Health Organization (File Photo)

Geneva, Jan 5: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ప్రమాదకర వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుండటంతో అన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదలతో (Rising Omicron cases) మరిన్ని కొత్త, అత్యంత ప్రమాదకర వేరియంట్లు (more dangerous variants) ఉద్భవించే ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation (WHO) హెచ్చరిస్తోంది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ.. దీని తీవ్రత భయపడినదానికంటే తక్కువగానే ఉంది. అయితే ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ వేరియంట్‌ ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ సీనియర్‌ ఎమర్జెన్సీస్‌ ఆఫీసర్‌ కేథరిన్‌ స్మాల్‌వుడ్‌ హెచ్చరించారు. ఒమిక్రాన్‌ ఎంత ఎక్కువ విస్తరిస్తే దాని వ్యాప్తి అంత ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కొత్త, మరింత ప్రమాదకర వేరియంట్లు రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉంది. డెల్టా కంటే తీవ్రత తక్కువే అయినప్పటికీ ఒమిక్రాన్‌ కూడా ప్రాణాంతకమే. మరి దీని తర్వాత వచ్చే వేరియంట్లు ఇంకా ఎలా ఉంటాయో ఎవరూ ఊహంచలేరు. ప్రస్తుతం మనమిప్పుడు అత్యంత ప్రమాదకర దశలో ఉన్నాం. ఇన్ఫెక్షన్‌ రేటు రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఒమిక్రాన్‌ ఉద్ధృతిని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం'' అని కేథరిన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

యూకేలో కరోనా బీభత్సం, ఒక్కరోజే 2లక్షల కేసులు, రికార్డులు బద్దలు కొడుతున్న కొత్త కేసులు, ఆస్పత్రుల్లో పెరుగుతున్న అడ్మిషన్లు

ఒమిక్రాన్‌ వ్యాప్తి ధాటికి అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. అక్కడ ఒక్క రోజే 10లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవడం వైరస్‌ ఉద్ధృతికి అద్దంపడుతోంది. ఇక ఐరోపా దేశాల్లోనూ కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. యూకేలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 2లక్షలు దాటాయి. కొవిడ్‌ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఐరోపాలో ఇప్పటివరకు 10కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. అమెరికాలో 5కోట్ల మందికి పైగా వైరస్‌ సోకింది.

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు డాక్టర్‌ అబ్దీ మహముద్‌ మంగళవారం పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ తొలిసారి బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ బారిన పడినవారిలో ఆసుపత్రుల పాలు కావడం చాలా తక్కువని, మరణాలు చాలా చాలా తక్కువని తెలిపారు. అయితే ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందని భావించలేమన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన ఉటంకించారు.

కరోనా థర్డ్ వేవ్ ఆందోళన, దేశంలో ఒక్కసారిగా 58,097 కేసులు నమోదు, 534 మంది కోవిడ్‌తో మృతి, 4.18 శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు

ఇప్పటివరకు, అధ్యయనాలు Omicron వేరియంట్ టీకాల ద్వారా అందించే రోగనిరోధక శక్తిని సులభంగా దాటవేయగలిగినప్పటికీ, కొత్త జాతి మునుపటి వేరియంట్‌ల కంటే తేలికపాటిదని సూచించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అనేక ప్రాంతాలలో 100 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 2021 చివరి వారంలో ఐదు మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మేము చాలా ప్రమాదకరమైన దశలో ఉన్నాము, పశ్చిమ ఐరోపాలో సంక్రమణ రేట్లు చాలా గణనీయంగా పెరగడాన్ని మేము చూస్తున్నాము మరియు దాని యొక్క పూర్తి ప్రభావం ఇంకా స్పష్టంగా లేదు" అని స్మాల్‌వుడ్ చెప్పారు.

యూరోపియన్ ఇన్‌ఫెక్షన్‌లలో, గత ఏడు రోజుల్లోనే 4.9 మిలియన్లకు పైగా నమోదయ్యాయి, 52 దేశాల్లో 17 లేదా భూభాగాలు ఒకే వారంలో అత్యధిక కేసుల మునుపటి రికార్డును అధిగమించాయి. గత వారంలో ఫ్రాన్స్ మాత్రమే ఒక మిలియన్ కంటే ఎక్కువ కొత్త కేసులను నమోదు చేసింది. అయితే ఐరోపాలో కోవిడ్ సంబంధిత మరణాలు తగ్గుతున్నాయని AFP నివేదించింది. యూరప్ గత వారంలో రోజుకు సగటున 3,413 కరోనావైరస్ మరణాలను నమోదు చేసింది, ఇది మునుపటి వారంతో పోలిస్తే ఏడు శాతం తగ్గుదలగా ఉంది