Ukrainian President Volodymyr Zelensky

New Delhi, February 25: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు (Russia-Ukraine War) రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ప్రధాన నగరాలపై గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. భూ, ఆకాశ, సముద్ర మార్గాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపులో ఏర్పడిన భారీ సంక్షోభాల్లో ఇదొకటి.

రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా (left alone) వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Ukrainian President Zelensky) ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలామ‌న్నారు. ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? అని మిత్ర‌ప‌క్ష దేశాల‌ను అడుగుతున్నాన‌ని తెలిపారు. ఒక వేళ త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉంటే నాటో కూట‌మిలోకి మ‌మ్మ‌ల్ని తీసుకోవ‌డానికి ఎందుకు సిద్ధంగా లేరు అని ప్ర‌శ్నించారు. మా దేశ భ‌ద్ర‌త హామీల గురించి మాట్లాడేందుకు తాము భ‌యప‌డం.. కానీ త‌మ దేశ ర‌క్ష‌ణ మాటేమిటి అని అడిగారు. ఆ హామీని ఏ దేశాలు త‌మ‌కు అందిస్తాయి అనేదే చూస్తున్నామ‌ని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 16 వేల మంది భారతీయులు, క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపిన విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా

సైనిక ల‌క్ష్యాల‌పై మాత్ర‌మే దాడులు చేస్తున్నామ‌ని ర‌ష్యా చెబుతున్న‌, పౌరుల‌పై కూడా దాడులు జ‌రుగుతున్నాయ‌ని జెలెన్‌స్కీ తెలిపారు. తాను రాజ‌ధాని విడిచి పారిపోయినట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఎంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్లోనైనా తాను ప్ర‌జ‌ల‌తోనే ఉంటాన‌ని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో (fight Russia) దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు’’ అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు NATO సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పారు. 316 మంది గాయపడినట్లు తెలిపారు. రష్యన్ విద్రోహ శక్తులు రాజధాని నగరం కీవ్‌లో ప్రవేశించాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కర్ఫ్యూను పాటించాలని కోరారు.

ఉక్రెయిన్ లో రష్యా రక్తపాతం, ఒక్కరోజే 137 మంది పౌరులు మృతి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్న ఉక్రెయిన్ వాసులు, దూకుడు పెంచిన రష్యా బలగాలు

తనను టార్గెట్ నెంబర్ వన్‌గా రష్యా గుర్తించినప్పటికీ, తాను, తన కుటుంబ సభ్యులు ఉక్రెయిన్‌లోనే ఉన్నామని తెలిపారు. దేశాధినేతను దెబ్బతీయడం ద్వారా రాజకీయంగా ఉక్రెయిన్‌ను నాశనం చేయాలని రష్యా కోరుకుంటోందన్నారు. ఇదిలా ఉంటే పుతిన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పుతిన్‌తో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోదీ... యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు.

యుద్ధం ( Russia-Ukraine War ) రెండో రోజునే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను టార్గెట్‌గా చేసుకుని రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్‌ నగరం వైపునకు రష్యా బలగాలు దూసుకెళుతున్నాయి. కీవ్‌ సిటీకి 30 కిలోమీటర్ల దూరం వరకు రష్యా సైనిక దళాలు చేరుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వం కీవ్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మాస్కోతో పోరాటానికి కైవ్‌ మాత్రమే ఒంటరిగా మిగిలిందన్న ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు జెలెన్‌స్క్ వ్యాఖ్యలు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కీవ్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

PM Modi Speaks to Putin: యుద్ధం ఆపండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ ఫోన్, హింసకు తెరదించాలంటూ విజ్ఞప్తి, ఉక్రెయిన్ లోని భారతీయులపై ఇరువురి మధ్య చర్చ

రష్యా జరుపుతున్న దాడుల్లో జరుగుతున్న విద్వంసాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు. కీవ్‌లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన దాదాపు 1,700 మంది రష్యన్లను అరెస్టు చేశారు. ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 1 లక్ష మంది ఉక్రెయినియన్లు తమ ఇళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. వేలాది మంది పొరుగున ఉన్న రుమేనియా, మాల్డోవా, పోలండ్, హంగేరీ దేశాలకు వెళ్లిపోతున్నారు.

ఇప్ప‌టికే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్న ర‌ష్యా బ‌ల‌గాలు ఇప్పుడు ఉక్రెయిన్ రాజ‌ధాని దిశ‌గా వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్‌లోకి ప్ర‌వేశించ‌కుండా ఉండేందుకు.. ఆ న‌గ‌రం స‌మీపంలో ఉన్న అత్యంత కీల‌క‌మైన బ్రిడ్జ్‌ను ఉక్రెయిన్ బ‌ల‌గాలు పేల్చేశాయి. ర‌ష్యా సైన్యం దూకుడును అడ్డుకునేందుకు ఆ బ్రిడ్జ్‌ను పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. కీవ్‌కు ఉత్తరం దిక్కున 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టెట‌రివ్ న‌ది స‌మీపంలో ఉన్న బ్రిడ్జ్‌ను వైమానిక దాడుల‌తో పేల్చేశారు. కీల‌క‌మైన ఈ బ్రిడ్జ్‌ను పేల్చివేయ‌డం ద్వారా ర‌ష్యా బ‌ల‌గాల వేగాన్ని కొంత నిలువ‌రించ‌వ‌చ్చు అని ర‌క్ష‌ణ‌శాఖ తెలిపింది.

బిక్కు బిక్కుమంటున్న భారతీయులు, ఉక్రెయిన్‌లో గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత, వెంట‌నే బాంబు షెల్ట‌ర్ల‌లోకి వెళ్లిపోవాల‌ని కోరిన భార‌త రాయ‌బార కార్యాల‌యం

ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చాప్టర్ 7 తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానంపై ఈస్టర్న్ టైమ్ ప్రకారం 15.00 గంటలకు ఓటింగ్ జరుగుతుంది. అయితే శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వీటో చేస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఈ నెలలో భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో రష్యా ఉంది. చాప్టర్ 7 తీర్మానం ఆమోదం పొందితే, రష్యా దాడిని తిప్పికొట్టేందుకు సైనిక సామర్థ్యాన్ని వినియోగించేందుకు అవకాశం కలుగుతుంది.

చాప్టర్ 6 తీర్మానం అయితే శాంతియుత పరిష్కారానికి కృషి చేయడానికి వీలు కల్పిస్తుంది. భద్రతా మండలిలో రష్యా సహా 15 దేశాలకు సభ్యత్వం ఉంది. అత్యంత కీలకమైన చాప్టర్ 7 తీర్మానానికి అనుకూలంగా రష్యా మినహా మిగిలిన దేశాలన్నీ ఓటు వేసే విధంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కృషి చేస్తున్నాయి. ఈ ఓటింగ్ నుంచి చైనా గైర్హాజరయ్యే అవకాశం ఉంది, భారత దేశం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రష్యాను ఏకాకిని చేయడం కోసం ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని భారత్, చైనాలను అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ గట్టిగా కోరుతున్నారు.

ఎక్కడివారు అక్కడే ఉండండి, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌‌కు ఎవరూ రావొద్దు, ఉక్రెయిన్‌లోని భారతీయులకు సూచించిన ఇండియన్‌ ఎంబసీ

ఈ తీర్మానంపై రష్యా వీటో చేసే అవకాశం ఉండటంతో, దీనిని సాధారణ సభలో ప్రవేశపెట్టి, ఆమోదం పొందాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ సభలో వీటో అధికారం ఏ దేశానికీ లేదన్న సంగతి తెలిసిందే. UNSC ముసాయిదా తీర్మానం ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కఠిన పదజాలంతో ఖండించింది. రష్యాను తిప్పికొట్టేందుకు బలగాలను ప్రయోగించేందుకు అధికారం కల్పించాలని కోరింది. ఉక్రెయిన్ నుంచి తక్షణమే వెనుకకు వెళ్ళాలని రష్యాను డిమాండ్ చేసింది. సైన్యాలను ఉక్రెయిన్ నుంచి బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. అంతర్జాతీయ శాంతిభద్రతలను ఉల్లంఘిస్తూ రష్యా దురాక్రమణకు పాల్పడిందని ఆరోపించింది.