Stockholm, May 3: యు.ఎన్-బ్యాక్డ్ కోవాక్స్ ద్వారా 1 మిలియన్ మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను భారతదేశానికి దానం చేయాలని (Sweden plans to donate 1 million doses) స్వీడన్ యోచిస్తోంది. స్కాండినేవియన్ దేశ అంతర్జాతీయ అభివృద్ధి సహకార మంత్రి పర్ ఓల్సన్ ఫ్రిద్ సోమవారం స్వీడిష్ బ్రాడ్‌కాస్టర్ ఎస్‌విటిపై ఈ విషయాన్ని ప్రకటించారు, ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఎలా ఉందో చూస్తున్నాం. ప్రజలు చనిపోతున్నారు, పేదరికం వ్యాప్తి చెందుతోంది, పిల్లలు ఇంకా బడిలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్తంగా పోరాడటానికి మనం చేయగలిగినదంతా చేయాలని ఆయన అన్నారు.
అయితే ఈ విరాళం స్వీడన్లో రోల్ అవుట్ పై ఎటువంటి ప్రభావం చూపదు, ఇది 65 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి మాత్రమే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (AstraZeneca vaccine to India) ఇవ్వాలని నిర్ణయించింది. ఆ దేశ వ్యాక్సిన్ కోఆర్డినేటర్ రిచర్డ్ బెర్గ్‌స్ట్రోమ్ మాట్లాడుతూ, స్వీడన్లు ఇవ్వగలిగేంత విడి టీకాలు ఉన్నాయని, ఇది కేవలం ఒక మిలియన్ మాత్రమేనని ... వాస్తవానికి మనకు మరో 4 లేదా 5 మిలియన్ల ఆస్ట్రా జెనెకా వ్యాక్సిన్ ఉందని తెలిపారు.
ఇక భారత్‌లో కరోనా కోరలు చాస్తున్నవేళ అమెరికా గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు 70 మిలియన్ డాలర్ల (రూ.510 కోట్లకు పైన) విలువైన మందులను ఇండియాకు (Pfizer Donates Medicines) అందివ్వనుంది. కంపెనీ చరిత్రలో మానవతా దృక్పథంతో అందించిన అతిపెద్ద సాయమని (Pfizer Donates USD 70 Million) ఫైజర్ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఫైజర్ ఇండియా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించారు.
అలాగే తమ కరోనా వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా తమకు అవకాశం రాలేదని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఫైజర్ మందులు (COVID-19 Treatment Drugs to India) ఉచితంగా అందాలన్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్బర్ట్ తెలిపారు.