Dodoma/Tanzania, Febuary 3: టాంజానియా దేశంలో (Tanzania) ఘోరం జరిగింది. ఓ మత బోధకుడిపై (Preacher) పెట్టుకున్న గుడ్డినమ్మకం కారణంగా 20 మంది ప్రాణాలు విడిచారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర టాంజానియా నగరమైన మోషిలో జరిగిన చర్చి సమావేశంలో ఈ తొక్కిసలాట (Tanzania Church Stampede) జరిగింది.
మోషి (Moshi) పట్టణంలో క్రైస్తవ మత ప్రబోధకుడు బోనిసెఫ్ మాంఫోసా నిర్వహించిన ప్రార్థనలకు (Church Meeting) వేల మంది వచ్చారు. అక్కడ ఆయన ఒక తైలాన్ని చూపిస్తూ అది అత్యంత పవిత్రమైనదని చెప్పారు. దానిని తాకితే రోగాలు నయమవుతాయని చెప్తూ కొంచెం నేలపై పోశారు.
భక్తులు ముందుకొచ్చి నూనెను తాకాలని కోరాడు. ఆ నూనెను తాకితే రోగాల నుంచి విముక్తి లభిస్తుందని భావించిన క్రీస్తు భక్తులు ఒక్కసారిగా ముందుకు వచ్చారు. దాంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఊపిరాడక అక్కడికక్కడే 20 మంది మృతి చెందారు.
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మతబోధకుడు అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు. పారిపోయిన అతడిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. పాస్టర్‌తోపాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్గత మంత్రి జార్జ్ సింబాచావేనే మాట్లాడుతూ వాంపోసా అరెస్టు చేశామని అన్నారు.
అయితే అతనిపై ఉన్న అభియోగాలు వెల్లడించలేదు. సింబాచవెన్ చర్చి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. సమావేశానికి అనుమతి నిబంధనలను కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ కార్యక్రమం ముందుగా వేసుకున్న ప్రణాళిక కంటే రెండు గంటలు ఆలస్యంగా నడిచిందని అన్నారు.
కాగా గత సంవత్సరం, దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని ఒక చర్చిలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.. ఆఫ్రికాలో సంపన్న బోధకుడు షెపర్డ్ బుషిరి నేతృత్వంలోని సేవలో ఈ ఘటన జరిగింది. అతను 2019 ఫిబ్రవరిలో తన ప్రైవేట్ జెట్‌లో దక్షిణాఫ్రికా నుంచి డబ్బును అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు
గత సంవత్సరం, తూర్పు దక్షిణాఫ్రికాలోని ఒక చర్చి భవనం ఈస్టర్ ప్రారంభంలో పాక్షికంగా కూలిపోయింది, భారీ వర్షపాతం కారణంగా ఇది జరగడంతో 13 మంది మరణించగా.. 16 మంది గాయపడ్డారు.