Andhra pradesh Floods (Photo-Twitter/Kadapa Police)

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన సంగతి విదితమే. వరదల్లో (Andhra Pradesh Floods) చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.

సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ( Rs 25 lakh to CM relief fund) అందించారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు భయంకరమైన విపత్తు వచ్చింది. దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి చేయూతగా ముఖ్యమంత్రి సహాయ నిధికి నా వంతు సాయంగా రూ. 25 లక్షలు విరాళం అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ చేతులు జోడించిన ఏమోజీని జత చేశారు.

Here's Their Tweets

అలాగే మెగాస్టార్‌ చిరంజీవి సైతం ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఏపీలో వరదల నష్టం రూ. 2 వేల కోట్లకు పైనే, తక్షణం రూ.వెయ్యి కోట్లిచ్చి ఆదుకోవాలని కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి, శాఖలవారీ నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్రానికి అందించిన రాష్ట్ర ప్రభుత్వం

అలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా తన వంతు సాయంగా బాధితుల కోసం రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఏపీ వరద విపత్తుకు నేను చేసే సాయం చిన్నదైనా బాధితులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.