Amaravati, Dec 13: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్, పవన్‌కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార వైసీపీ, జనసేన మధ్య పోర్ పతాక స్థాయికి చేరింది. గతంలో చిత్రసీమ అంశం మీద వైఎస్ జగన్ మీద విరుచుకుపడని పవన్ కళ్యాణ్ (JanaSena chief Pawan Kalyan ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో తన సినిమాలను ఆపేసి తనను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన ఒక్కడిపై ఉన్న కోపంతో సినీ ఇండస్ట్రీపై పగ సాధిస్తున్నారని ఇదివరకే జగన్ ప్రభుత్వంపై (YS Jagan govt) ఇదివరకే పవన్ కళ్యాణ్ మండిపడిన విషయం విదితమే. తాజాగా తన సినిమాలను ఆపేస్తే భయపడనని.. అంత పిరికి వాడిని కాదని స్పష్టం చేశారు.
పంతానికి దిగితే తన సినిమాలను ఉచితంగా ఆడిస్తానని సెన్సేషనల్ కామెంట్ చేశారు. పారదర్శకత అంటే అందరి విషయంలో ఉండాలని.. కొన్ని విషయాల్లో మాత్రమే ఉండకూడదంటూ హితవుపలికారు. సినిమా టికెట్లలో (Movie Ticket Rates) పారదర్శకత లేదు.. మరి ప్రభుత్వం జరిపే మద్యం అమ్మకాల్లో పారదర్శకత ఉందా అని ప్రశ్నించారు. రూ.700తో మద్యం కొని 5రూపాయలతో సినిమాకు వెళ్లండని చెబుతారా? ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించారా? కనీసం శిలాఫలకం అయినా పెట్టారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఆర్ఆర్ఆర్‌పై మహేష్ బాబు సంచలన ట్వీట్, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెక్టాక్యూలర్ అంటూ పొగడ్తల వర్షం
ఏపీలో టికెట్ల ధరల విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమా టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను నిర్ణయించింది.