ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పందించారు. ఈ విషయంలో (AP Film Ticket Price Issue) ఏపీ సీఎం జగన్‌తో కలువనని స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి బృందం సభ్యులు సీఎంతో చర్చించేందుకు తనను కూడా ఆహ్వానించారని అయితే తాను రాననే చెప్పానని వెల్లడించారు. తాను సినిమా బడ్జెట్ పెంచనని, సీఎం జగన్‌ను కలవనని పేర్కొన్నారు. ఏపీలో టికెటు రేట్లు తక్కువగా ఉన్నప్పుడే ‘అఖండ’ సినిమా విజయవంతం కావడమే ఒక ఉదాహరణ అని ఆయన (MLA and Hero Balakrishna ) చెప్పుకొచ్చారు.
కాగా వైఎస్ జగన్‌ను (CM YS Jagan) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కలిశారు. గత మూడు నెలల క్రితం ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన తరువాత ఏపీ సీఎంను కలవడం ఇదే తొలిసారి . ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంతో పాటు సినీ రంగ సమస్యలపై వారిద్దరుచర్చించారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటాం, సినీ పరిశ్రమ సమస్యలపై కమిటీ కూడా వేశామని తెలిపిన మంత్రి పేర్ని నాని, సీఎం జగన్‌తో ముగిసిన సినీ ప్రముఖులు భేటీ
వారం రోజుల క్రితం చిరంజీవి బృందం ఆధ్వర్యంలో సినీ నటులు ప్రభాష్, మహేశ్, అలీ, ఆర్.నారాయణ మూర్తి, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిసి ఏపీలో సినీ సమస్యలపై జగన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం చర్చల సారాంశాన్ని వారు వివరిస్తూ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి చెందిన విషయం తెలిసిందే.