Balakrishna Visit Kanaka Durga Temple: మల్టీస్టారర్‌ చేయడానికి నేను రెడీ, దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తానని తెలిపిన బాలకృష్ణ, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న అఖండ చిత్ర బృందం
Balakrishna Visit Kanaka Durga Temple (Photo-Video Grab)

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ ఘన విజయంతో దూససుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'అఖండ' చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను (Kanaka durga Temple in Vijayawada) దర్శించుకుంది.

అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి (Balakrishna Visit Kanaka Durga Temple) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ (Nandamuri Balakrishna) మీడియాతో మాట్లాడారు. 'అఖండ' చిత్రం విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యమొచ్చిందన్నారు. అఖండ సినిమా ఘన విజయం సాధించడం ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబసపరివార సమేతంగా థియేటర్లకు వస్తున్నారు.

సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది

మన సనాతన ధర్మాన్ని తెలియజేసిన చిత్రం 'అఖండ' (Akhanda). దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్‌ చేస్తా. ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరల విషయంపై 'అఖండ' విడుదలకు ముందు మేమంతా చర్చించాం. కానీ, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది.. ఏం జరుగుతుందో చూద్దాం'' అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అనంతరం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామిని 'అఖండ' చిత్రబృందం దర్శించుకుంది.