Prabhas in Adipurush (Photo Credits: Instagram)

బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కించుకున్న ప్ర‌భాస్‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ద‌ర్శ‌కులు తెగ‌ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో 'తానాజీ' ద‌ర్శ‌కుడు ఔంరౌత్‌తో (Bollywood director Om Raut) క‌లిసి ప్ర‌భాస్ ఆదిపురుష్ (Prabhas Adipurush) అనే పౌరానిక సినిమాలో నటిస్తున్నారు. "చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం" అనేది క్యాప్ష‌న్‌. ఈ పోస్ట‌ర్‌లో హ‌నుమంతునితోపాటు ఎంద‌రో మునులు కూడా ఉన్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి టి సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ (Adipurush) ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు (Lord Ram) ప్రభాస్‌ సరిగ్గా సెట్‌ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం

దేశమంతటా రాముడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో రాముడిపై సినిమా వస్తే మరింత బాగుంటుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. ఈ సినిమా కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నానని జక్కన్నఅన్నారు.

Fan Made Posters

బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ (Radha Krishnan) దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam) చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేసేందుకు అంగీకరించారు ప్రభాస్‌. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రభాస్ న్యూ లుక్ వెరీ రొమాంటిక్, అదరగొడుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే, రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల

ఇది ఇలా ఉండగానే ఆకస్మాత్తుగా 22వ చిత్రం ‘ఆదిపురుష్‌’ని ప్రకటించారు డార్లింగ్‌. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలయిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.

Om Raut Tweet

త్రీడీలో రూపుదిద్దుకోనుండ‌టం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అనువాదం చేయ‌నున్నారు. సుమారు రూ.500 కోట్ల బ‌డ్జెట్‌ కేటాయించిన‌ ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ ఈ ఏడాదే ప్రారంభం అవుతుండ‌గా, వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తామంటున్నారు. ప్ర‌భాస్ 22 వ సినిమాలో రాముడిగా లేదా విష్ణువుగా క‌నిపించ‌నున్నార‌ని అభిమానులు జోస్యం చెప్తున్నారు. ఇదే నిజ‌మైతే ప్ర‌భాస్ కెరీర్‌లో ఈ చిత్రం ప్ర‌త్యేకంగా నిలిచిపోనుంది. మ‌రోవైపు లాక్‌డౌన్‌లోనూ సినిమా అనౌన్స్ చేసి త‌మ‌ను స‌ర్‌ప్రైజ్ చేశారంటూ అభిమానులు #Prabhas22, #Adipurushను ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ 21లో సర్‌ప్రైజ్, డార్లింగ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ దీపిక, అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్

కాగా రాముడి సరసన సీతాదేవి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ నేపథ్యంలో మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ ప్రభాస్‌తో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.అంతేగాక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ లో చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రభాస్ విలు విద్య నేర్చుకోనున్నారు ప్రభాస్‌. అలాగే విలు విద్య చేసేవారి శరీరాకృతిని పోలినట్లుగా తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ఓం తెలిపారు. ‘‘నా కథలో రాముడిగా ప్రభాస్‌ని తప్ప ఎవ్వర్నీ ఊహించుకోలేకపోయా. ఈ పాత్రను అతను తప్ప ఎవ్వరూ చేయలేరనిపించింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ స్టార్‌ ప్రభాస్‌. మౌనంగా మునిలా ఉంటూనే, రౌద్రంగా గర్జించగలిగే విభిన్నమైన కాంబినేషన్‌ ప్రభాస్‌. ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నాం. దానికి సంబంధించి నిపుణులతో సంప్రదిస్తున్నాం. అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నారు ప్రభాస్‌’’ అని తెలిపారు ఓం రౌత్‌.