Hyderabad, Dec 7: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజును (Dil Raju) తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt.) కీలక పదవిలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) (TFDC) ఛైర్మన్ గా రాజును నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తనకు ఈ పదవిని అప్పగించడంపై దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన బాధ్యతలను శక్తివంచన లేకుండా పూర్తిచేస్తానని పేర్కొన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజుని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/Fh0AN3pt4c
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
పదవి అందుకనేనా??
దిల్ రాజుకు కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉన్నట్టు చెప్తారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరుఫున ఎంపీ లేదా ఎమ్మెల్యేగా దిల్ రాజు పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. ఈ క్రమంలోనే ఆయనకు తెలంగాణ సర్కారు కీలక పదవి అప్పగించడం గమనార్హం.