Janasena Chief Pawan Kalyan | File Photo

Chittoor, Sep 2: జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా, పెను విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ (Three Pawan Fans Electrocuted) తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ముగ్గురు జనసేన సైనికులు మరణించడం తన హృదయాన్ని కలచివేసిందని, వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కడపల్లి పంచాయతీలోని పవన్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలు బుధవారం పవన్‌ జన్మదిన కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాట్లు (Pawan Kalyan birthday celebrations) చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి జాతీయ రహదారి పక్కన బ్యానర్లు కట్టారు. ఈ సందర్భంగా ఓ 30 అడుగుల ఫ్లెక్సీ విద్యుత్‌ తీగల మీద పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి (Pawan Kalyan birthday tragedy) చెందారు. తీవ్రంగా గాయపడిన అరుణ్, హరి, పవన్‌.. కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Three Pawan Fans Electrocuted

మరణించిన వారి కుటుంబాలతో పాటు గాయపడ్డ వారికి అండగా ఉంటానని ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసారు. అంతేకాదు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ నాయకులను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Jana Sena party chief Pawan Kalyan) ఆదేశించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్' చిత్ర యూనిట్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతేకాదు మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తామని చిత్ర నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ అధికారికంగా ప్రకటించారు. వరంగల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం, అయిదు మంది స్పాట్‌లోనే మృతి, వరంగల్‌ నుంచి పరకాలకు వెళుతుండగా కారును ఢీకొట్టిన లారీ

ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'చిత్తూరులో పవన్ పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం నా గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ, మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

చిత్తూరు జిల్లా శాంతిపురం సమీపంలో ముగ్గురు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విద్యుత్ షాక్ తో మరణించారని తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Sri Venkateswara Creations Tweet

ఈ ఘటన ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి చిత్రబృందం మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. సత్యమేవ జయతే అంటూ సాగుతూ.. గాంధీజీ ఫొటోతో ప్రారంభమైన ఈ మోషన్ పోస్టర్‌లో వకీల్ పాత్రలో పవన్ కళ్యాన్ నల్లకోటు, చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం, మరో చేతిలో కర్ర పట్టుకుని కనపడుతున్నాడు. లాయర్ లుక్‌లో పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ కనబడుతూ.. బేస్ బాల్ బాట్ పట్టుకుని అదరగొట్టాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వకీల్ సాబ్‌ను దిల్ రాజు, బోనీ కపూర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.