COVID-19 Deaths in India: కేరళను కాటేసిన కరోనావైరస్, తొలి మరణం నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృద్ధుడు మృతి, ఇండియాలో 20కి చేరిన మృతులు
Coronavirus cases | (Photo Credits: PTI)

New Delhi, March 28: కేరళ రాష్ట్రంలో తొలి కరోనా మరణం (First Coronavirus Death in Kerala) నమోదైంది. వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వ్యక్తి కొచ్చి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృత్యువాత పడ్డాడు. దుబాయ్‌నుంచి ఇండియాకు వచ్చిన సదరు వ్యక్తి ఈనెల 22న నిమోనియా లక్షణాలతో కొచ్చిలోని కాలమస్సేరి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అతడి ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పటంతో వైద్యులు అతనిని వెంటిలేటర్‌పై ఉంచారు .

కరోనాపై ఆర్మీ ‘ఆపరేషన్ నమస్తే’ వార్

అయితే గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న అతడు బీపీ విపరీతంగా పెరిగిపోయి మరణించాడు. కరోనా వైరస్‌ (Coronavirus) కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు ఎర్నాకులం జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌కే కుట్టప్పన్‌ మీడియాకు వెల్లడించారు. కేరళలో వృద్ధుడి మరణంతో భారతదేశంతో కరోనా మృతుల సంఖ్య 20కి (Coronavirus Deaths in India) చేరింది.

కరోనాపై చెత్త పోస్ట్, జైలుపాలయిన ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగి

భారత్‌లో ఇప్పటివరకు 873 వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కేరళలో ఆ సంఖ్య 164గా ఉంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 39 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు.

Here's ANI Tweet

కరోనా వైరస్‌ వ్యాధికి మెడిసిన్‌ కనుగొనేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది .

ఇది తాగితే కరోనావైరస్ చస్తుంది, ఇరాన్‌లో షికార్లు చేస్తున్న పుకార్లు

కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59, గుజరాత్‌లో 54, రాజస్థాన్‌లో 50, యూపీలో 50, ఢిల్లీలో 40, తమిళనాడులో 40, పంజాబ్‌లో 38, హర్యానాలో 33, మధ్యప్రదేశ్‌లో 33, జమ్మూకశ్మీర్‌లో 20, బెంగాల్‌లో 15, ఏపీలో 13, లడఖ్‌లో 13, బీహార్‌లో 9, ఛండీఘర్‌లో 8, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 6, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.