Amaravati, May 5: బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా (South Andaman Sea) ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుంది. ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా (Cyclone) మారుతున్న ఈ తుఫాన్‌కి ఎంఫాన్ (Cyclone Amphan) అనే పేరు దీనికి పెట్టారు. ఎంఫాన్ తుఫాన్ ఓడిస్సా పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఓడిస్సా తీర ప్రాంతాల్లో దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ECMWF) ప్రకారం.. ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా మత్స్యకారులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర, ఒడిసా తీర ప్రాంత జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు. కర్నూలులో 516కు చేరిన కరోనా కేసులు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 67 కేసులు నమోదు, రాష్ట్రంలో 1717కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
మే9 నుండి మే11 తేదీ లోపు అంఫాన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడనున్నట్లు వాతావరణ శాఖ నుండి వార్తలు వస్తున్నాయి. మే 9 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాను రాష్ట్రాన్ని బలంగా తాకే ప్రమాదం ఉండటంతో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అటు బోర్డర్ లో ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా ఈ తుఫాను పై ముందుగానే దీని భారినుండి తప్పించుకోవడానికి ప్రణాలికలు సిద్దం చేస్తున్నాయి.
రాష్ట్రానికి ముప్పు పొంచివుందని.. ఎంఫాన్ తుఫాను విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) హెచ్చరించారు. తుఫాను వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సముద్రంలో చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని సూచించారు. తుపాను వస్తే ఏం చేయాలనే దానిపై అధికారులు కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. తుఫాను మన రాష్ట్రం వైపు వస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తుఫానును దృష్టిలో ఉంచుకుని రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వీలైనంత వరకూ కొనాల న్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూ డింట ఒక వంతు సర్కారే కొనుగోలు చేయాలన్నారు. ఆపంటలకు మార్కెట్ ఏర్పాటు చేసుకుని పంపాలని ఆదేశించారు.