Exams Representational Image. |(Photo Credits: PTI)

ఏపీ ఎంసెట్ “కీ” విడుదల అయింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎంసెట్-2022 జవాబు కీ నీ ఈరోజు విడుదల చేశారు. ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్ లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలతో పాటు AP EAMCET ఆన్సర్ కీ ని విడుదల చేయబడింది. ఏపీ ఎంసెట్ ఆన్సర్ కి రిలీజ్ఏపీ ఎంసెట్ జవాబు కీ ని డౌన్లోడ్ చేయడానికి మరియు యాక్సిస్ చేయడానికి, పరీక్షలకు హాజరైన దరఖాస్తుదారులకు ఆధారాలు అవసరం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2022) ఈ నెల 4 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ (Engineering) పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ (agriculture), ఫార్మసీ (Pharmacy) పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్

అయితే.. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో ఈఏపీ సెట్‌లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇవ్వనున్నారు. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏపీ ఎంసెట్ ఆన్సర్ కీ ని ఎలా డౌన్లోడ్ చేయాలి….

అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి- sche.ap.gov.in/EAPCET

మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ & ప్రిలిమినరీ కీ లు (E) లింకుపై క్లిక్ చేయండి. కనిపించిన సబ్జెక్టు కోసం సమాధాన కీ నీ ఎంచుకోండి.

ఏపీ ఎంసెట్ 2022 సమాధాన కీ తెరపై ప్రదర్శించబడుతుంది.

సంభావ్య స్కోర్ లను లెక్కించడానికి Pdf నీ డౌన్లోడ్ చేయండి. ప్రతిస్పందనతో సరిపోల్చండి.