ఏపీ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 11న ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగష్టులో EAP సెట్ ఫలితాలు, సెప్టెంబర్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు మంత్రి (AP Education Minister, Adimulapu Suresh) పేర్కొన్నారు. తెలంగాణలో జూలై 14 నుంచి ఎంసెట్, జూలై 13న ఈసెట్, జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు, జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు
గతంలో 136 సెంటర్లలో నిర్వహించామని, ఈ సారి అవసరమైతే సెంటర్ల సంఖ్య పెంచుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. తెలంగాణలోనూ 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ కంటే ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. టెన్త్ , ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేశామన్నారు.