Amaravati, june 19: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ (AP EAMCET 2021 Schedule Released) నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ (EAPCET-2021 Engineering, Agriculture and Pharmacy Common Entrance Test) గా మార్చుతున్నట్లు మంత్రి (AP Education Minister Adimulapu Suresh) వెల్లడించారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్టుగా ఎప్‌సెట్‌ను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈనెల 24న నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని, జులై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.ఇదిలా ఉంటే.. ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీసెట్, ఎంట్రెన్స్ టెస్ట్‌లను సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నోటిఫికేషన్ వివరాలు
- ఆగస్ట్ 19 నుంచి 25 వరకు ఏపీ సెట్ పరీక్షలు
- జూన్ 24న నోటిఫికేషన్ విడుదల
- జూన్ 26 నుంచి జూలై 25 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరణ
- జూలై 26 నుంచి ఆగస్ట్ 5 వరకు 500 లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
- అగస్ట్ 6 నుంచి 10 వరకు 1000 రుపాయిల లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
- అగస్టు 11 నుంచి 15 వరకు 5 వేల రుపాయలు లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ
- అగస్టు 16 నుంచి 18 వరకు 10 వేల రుపాయిలు లేట్ ఫీజుతో అప్లికేషన్ల స్వీకరణ