Exams Representational Image. |(Photo Credits: PTI)

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ ఫలితాలను బోర్డు విడుదల చేసింది . ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు టైంలో 20 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించడం విశేషం. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. ప్రిలిమనరీ పరీక్షలకు 88 వేల మంది నిరుద్యోగులు హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమనరీ ఫలితాలను ప్రకటించింది.

ఏపీలో మే 15 నుంచి ఈఏపీసెట్‌, అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేసిన APSCHE, పూర్తి వివరాలు కథనంలో..

దాంతో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఏప్రిల్‌ 23వ తేదీన గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.  ఫలితాలను psc.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.