Representational Image (File Photo)

Newdelhi, Nov 25: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ (JEE Advanced) షెడ్యూ ల్‌ విడుదలైంది. ఐఐటీల్లో (IIT) ప్రవేశాలకు ఈ పరీక్షను వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో (Two Sessions) నిర్వహించనున్నట్టు ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌2 పరీక్ష ఉంటుందని వివరించింది. పరీక్ష దరఖాస్తు ప్రక్రియ 2024 ఏప్రిల్‌ 21 నుంచి ఏప్రిల్‌ 30 వరకు కొనసాగనున్నదని వెల్లడించింది. దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మే 6 వరకు ఆన్‌ లైన్‌ లో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నది. 2024 మే 17 నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించింది. రెస్పాన్స్‌ షీట్లను మే 31న వెబ్‌ సైట్‌ లో పొందుపరచనుండగా, ప్రాథమిక ‘కీ’ని జూన్‌ 2, తుది ‘కీ’ని జూన్‌ 9న విడుదల చేస్తారు. జూన్‌ 9నే జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలను విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌ -2024 లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్‌ డ్‌ రాయడానికి అర్హులు. జేఈఈ మె యిన్‌ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30న ముగియనున్నది. జేఈఈ మెయిన్‌ పేపర్‌1 వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు, పేపర్‌2 ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 15వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 12న ఫలితాలు ప్రకటిస్తారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి ప్రారంభంకానున్నది.

BRS Interest Subvention Scheme: ఇంటి రుణగ్రస్తులకు శుభవార్త.. హోమ్‌ లోన్‌ పై వడ్డీని కట్టే స్కీంను యోచిస్తున్నాం.. మంత్రి కేటీఆర్ వెల్లడి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్‌ (2024 సంవత్సరంలో)

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్‌ 21
  • దరఖాస్తులకు తుది గడువు- ఏప్రిల్‌ 30
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌ లోడింగ్‌- మే 17
  • పరీక్షా తేదీ- మే 26
  • ఫలితాల ప్రకటన- జూన్‌ 9
  • కౌన్సెలింగ్‌ ప్రారంభం- జూన్‌ 10

Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..