Amaravati, May 14: కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో పదవ తరగతి పరీక్షలు (AP SSC Exams 2020) వాయిదాపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు (July 10 To 15) నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. నెల్లూరులో 15 కొత్త కేసులు, ఏపీని వణికిస్తున్న థానే,కోయంబేడు, 2100కు చేరుకున్న మొత్తం కోవిడ్ 19 కేసులు, శ్రీకాకుళంలో మరో రెండు తాజా కేసులు
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఏడాది ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.
కాగా,లాక్‌డౌన్ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే. కోవిడ్ 19 ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
పరీక్షల టైం టేబుల్ ఇదే
జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)
జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm)
జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm)
జూలై 13న మ్యాథ్స్ (9.30am- 12.45pm)
జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm)
జూలై 15న సోషల్ స్టడీస్ (9.30am- 12.45pm)