AP Coronavirus Report: నెల్లూరులో 15 కొత్త కేసులు, ఏపీని వణికిస్తున్న థానే,కోయంబేడు, 2100కు చేరుకున్న మొత్తం కోవిడ్ 19 కేసులు, శ్రీకాకుళంలో మరో రెండు తాజా కేసులు
Screening for coronavirus | Representational image | (Photo Credits: PTI)

Amaravati, May 14: ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (AP Coronavirus Report) 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనావైరస్‌ (Coronavirus) బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం

ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు సంబంధించినవారు.

ఈ వైరస్‌ (COVID-19) బారిన పడిన 50 మంది కోలుకుని ఈ రోజు డిశ్చార్జి అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 591 కేసులు, గుంటూరులో 404, కృష్నా 351, చిత్తూరు 151, నెల్లూరు 126, అనంతపురంలో 118, కడప 99, పశ్చిమ గోదావరి 69, విశాఖపట్నం 66, ప్రకాశం 63, తూర్పుగోదావరి 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9256 సాంపిల్స్‌ పరీక్షించగా.. 68 మంది కోవిడ్‌19 పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వీటిలో 32 పాజిటివ్‌ కేసులు ఇతర రాష్ట్రాల వారికి చెందివని (మహారాష్ట్ర 29, ఒడిశా 2, బెంగాల్‌ 1)

Here's AP Corona Report

శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండటం కాసింత ఊరటనిచ్చే అంశం. కాకపోతే వారిలో ఒకరు చెన్నై నుంచి వచ్చిన వ్యక్తి కావడం ఆందోళన కలిగిస్తోంది.. జిల్లాలో ఇదివరకు ఐదు కేసులు నమోదు కాగా వారిలో నలుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో నిశ్చితగా ఉన్న దశలో మరో రెండు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది రాష్ట్రాల్లో జీరో కేసులు, దేశ వ్యాప్తంగా 78 వేలు దాటిన కరోనా కేసులు, ప్రపంచవ్యాప్తంగా 45 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మృతుల సంఖ్య 3 లక్షలకు చేరువలో..

మహారాష్ట్రలోని థానే నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వలస కూలీల్లో 37 మందికి కరోనా పాజిటివ్‌ రావడం, చెన్నైలోని అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ ‘కోయంబేడు’కు వెళ్లొచ్చిన వారిలో 104 మంది ఆచూకీ గల్లంతు కావడంపై అధికారుల్లో టెన్షన్‌ మొదలైంది. దీంతో వెంటనే అలర్ట్‌ అయ్యి.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్న వలసదారులపై గట్టి నిఘా వేయాలని నిర్ణయించారు.  వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది

మహారాష్ట్రలోని థానే నుంచి ప్రత్యేక రైలులో 930 మంది వలస కూలీలు మంగళవారం రాత్రి గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వీరిలో అత్యధిక మంది కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన వారే. వీరిలో ఇప్పటివరకు 250 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 38 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 37 మంది కర్నూలు జిల్లావాసులు కాగా.. మిగిలిన ఒక్కరూ కడప వాసి. మిగిలిన వారందరికీ పరీక్షలు కొనసాగుతున్నాయి.  లాక్‌డౌన్‌ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి గానీ, పట్టణాల్లోకి గానీ ఎక్కడి నుంచైనా వలసదారులు వస్తే సమాచారం సేకరించాలని ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు కూడా నేరుగా రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104 లేదా 1902కు ఫోన్‌ చేయొచ్చని సూచిస్తున్నారు.